Ads
ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని చెప్తున్నా పెళ్లి సంబంధాలు చూస్తామని అంటున్నా ఏమాత్రం వినడం లేదు. ఇంకా పై చదువులు చదువుకుంటామని.. ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటామని లేదంటే కొంత సంపాదించిన తర్వాత సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని చాలా మంది అంటున్నారు. కానీ 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే కొన్ని సమస్యలు తప్పవు.
మరి 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనకి వయసు పెరిగే కొద్ది ఓపిక తగ్గిపోతూ ఉంటుంది.
కాస్త తక్కువ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలు కనడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వయసు పెరిగే కొద్దీ ఓపిక తగ్గుతుంది. కాబట్టి కాస్త త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం మంచిది. 28 ఏళ్ల కంటే ముందే పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆడవాళ్ళకి హార్మోన్లు వయసు పెరిగే కొద్దీ మారుతూ ఉంటాయి. కొంచెం 40 దాటే సరికి మెనోపాజ్ మొదలవుతుంది. మన శరీరంలో జరిగే మార్పుల్ని తట్టుకునే ఓపిక తక్కువ వయసులో ఉంటుంది. కాబట్టి పెళ్లి విషయంలో మహిళలు ఆలస్యం చేయడం మంచిది కాదు.
Ads
కాస్త 25, 30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో రకరకాల సమస్యలు మొదలవుతుంటాయి. ఇవన్నీ రాకముందే పెళ్లి చేసుకోవడం పిల్లలు కనడం కాస్త ఫ్యామిలీని సెట్ చేసుకోవడం వంటివి చేస్తే మంచిది. పైగా మన పిల్లలు పెద్ద అయ్యేసరికి మనం వృద్ధాప్యంలోకి వచ్చేస్తూ ఉంటాము. పిల్లలకి మన అవసరం ఉంటుంది. అందుకని వాళ్ళ వయసును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ సమస్యల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
పిల్లలు పుట్టడం లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ మధ్యకాలంలో జీవన విధానంలో మార్పులు రావడం ఆహార పదార్థాలు తీసుకునే విధానంలో మార్పులు రావడం వలన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పెళ్లి త్వరగా చేసుకోండి లేకపోతే ఆరోగ్యంగా ఉండడం మంచిది. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక కొంచెం త్వరగా పెళ్లి చేసుకోవడం ఉత్తమం.