చీకటి పడ్డాక ఇల్లు ఊడిస్తే లక్ష్మీ దేవి ఇంట్లో అని…రాత్రిపూట గోర్లని కత్తిరించకూడదు అని అంటారు .దాని వెనుక కారణం ఇదే

Ads

మన పెద్దవాళ్లు ఎన్నో విషయాలను మనకు చెప్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది.. ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఎందుకు ఇలాంటి రూల్స్ ని పెట్టారు అని.. ఎప్పుడైనా మీ పెద్ద వాళ్ళు ఇలా చెప్పడాన్ని విన్నారా.. చీకటి పడ్డాక ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని వెళ్ళిపోతుందని అనడం.. మరి చీకటి పడ్డాక ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదా దాని వెనుక కారణం ఏమిటి అనే విషయాన్ని చూద్దాం.

దీపాలు పెట్టకముందే ఇల్లు తుడిచేయాలి. దీపాలు పెట్టిన తర్వాత అస్సలు ఇల్లు తుడవకూడదు. బంగారం లేదా విలువైన వస్తువులు ఏమైనా కింద పడితే చీకటి పడిన తర్వాత ఇల్లు తుడిచినప్పుడు కనపడవు.

Ads

అందుకనే వెల్తురు ఉన్నప్పుడే తుడుచుకోవాలి. అప్పుడు ఏమైనా విలువైన వస్తువులు కనపడకపోయినా కనపడతాయి. వెల్తురు ఉండగానే ఇల్లు తుడుచుకోవడం మంచిది. అందుకనే పెద్దలు ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని అంటారు. రాత్రిపూట తల దువ్వుకోవడం కూడా మంచిది కాదు దీని వెనక కారణం ఏంటంటే రాత్రిపూట తల దువ్వుకుంటే జుట్టు అన్నిట్లోనూ పడుతూ ఉంటుంది. అది ఎక్కడ రాలిందనేది కూడా మనకి కనపడదు. తినే అన్నం లోకి కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకని రాత్రి పూట తల దువ్వుకోకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు.

సంధ్య వేళలో నిద్రపోవడం కూడా మంచిది కాదు. ఆ సమయంలో పడుకుంటే దరిద్రం వస్తుందని పెద్దలంటూ ఉంటారు. దీని వెనక కారణం ఏమిటంటే ఆ సమయంలో పడుకుంటే మళ్ళీ రాత్రి నిద్ర పట్టదు అని.. ఆరోగ్యం బాగోదు దరిద్రమే కదా మిగిలింది. కాబట్టి సాయంత్రం పూట పడుకోకూడదని పెద్దలు అంటూ ఉంటారు. రాత్రిపూట గోర్లని కూడా కత్తిరించకూడదు. తినే ఆహారంలో పడే ప్రమాదం ఉంది అందుకని పెద్దలు ఇలాంటి నియమాలని పెట్టారు. కాదు అని మనం పాటించడం వలన మనకే నష్టం.

 

Previous article30+తర్వాత పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఇవే
Next articleరాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు… కారణం ఏమిటో తెలుసా..?