Ads
మనకి నిద్రలో కలలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆలోచించే వాటి మీద కలలు సహజంగా వస్తూ ఉంటాయి. పరీక్షల్లో ఫస్ట్ మార్కులు వచ్చినట్లు.. ఉద్యోగం వచ్చేసినట్లు లేకపోతే ప్రేమించిన వ్యక్తితో పెళ్లి అయినట్లు ఇలాంటివి.. అయితే ఒక్కొక్కసారి మనకి కలలో చనిపోయిన వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు. మనకి బాగా ఇష్టం అయిన వాళ్ళు మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతే వాళ్ళు మనకి కలలో కనపడుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మనం పెద్దల్ని ఎందుకు కలలోచనిపోయిన వాళ్ళు కనబడుతున్నారు అని అడిగితే..
ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని చెప్తూ ఉంటారు. కొంతమంది చనిపోయిన వాళ్లకి సరిగ్గా కర్మలు జరగకపోవడం వలన కలలో కనపడతారని అంటారు. మీరంటే కోపం ఉన్నా ప్రేమ ఉన్నా కూడా కలలోకి వస్తారని కొంతమంది అంటూ ఉంటారు. ఇలా ఎవరికి తోచిన కారణాలని వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే చనిపోయిన వాళ్ళు కలలోకి రావడం వెనుక మరో అర్థం ఉంది. చనిపోయిన వారు అలా కలలోకి రావడం వెనక గల కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Ads
- ఎవరైనా వ్యక్తి యాక్సిడెంట్లో కానీ ప్రకృతి విపత్తుల్లో కానీ చనిపోయినట్లయితే వారి కుటుంబానికి ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయట.
- ఒకవేళ కలలో పాము కనబడితే పూర్వికులు ఆశీస్సులు వారికి బలంగా ఉంటాయని దానికి సంకేతం. పైగా పూర్వికులు ఏదో ఒక లోకంలో ఆనందంగా బతికి ఉన్నారని అనుకోవాలి. చనిపోయిన వారి కర్మలను మనం చేస్తున్నప్పుడు ధనం వచ్చినా అనుకున్న పనులు పూర్తయినా ఎప్పటినుండో ఆగిపోయిన పనులు పూర్తయినా పూర్వికులు ఆశీస్సులు వారికి ఎక్కువ ఉంటాయి.
- ఒకవేళ కనుక కలలో చనిపోయిన వ్యక్తి ఆనందంగా ఉన్నట్లు ఆశీర్వదిస్తున్నట్లు కనుక కనపడితే వారికి అంతా శుభమే జరుగుతుందని దానికి సంకేతం.
నిజంగా చనిపోయిన వాళ్లకి మనం మన ధర్మం ప్రకారం చేయవలసిన కార్యక్రమాలను పూర్తి చేయాలి. 15 రోజులలోపు కర్మకాండలు.. నెలకి ఒకసారి మాసికం.. ఏడాదికి ఒకసారి చనిపోయిన వారి పేరుని తలుచుకుని కార్యక్రమం చేయడం ఇవన్నీ కూడా తప్పక ఆచరించాలి అలా చేస్తే మంచి కలుగుతుంది.