దసరా సినిమాని రిజెక్ట్ చేసి తప్పు చేసిన.. ఆ హీరో ఎవరు అంటే..?

Ads

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమా మంచి హిట్ అందుకుంది. భారీ అంచనాలతో ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా సినిమా బాగా ఆడింది. వరల్డ్ బాక్సాఫీస్ బరిలో భారీగా కలెక్షన్లు ని రాబట్టింది దసరా సినిమా. పైగా ఈ సినిమా పాటలు కూడా అందరికీ నచ్చుతాయి. కీర్తి సురేష్ కూడా నాని సరసన నటించి బాగా ఆకట్టుకున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెర మీదకి వచ్చింది.

నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. నానికి ఈ సినిమా మంచి ప్లస్ అయింది. ఈ సినిమా చేసి నాని ఇంకో మెట్టు ఎక్కేసాడు. అయితే ఈ సినిమా కథని మొదట నానికి చెప్పలేదు దర్శకుడు ఈ సినిమా స్టోరీని ముందు ఇంకో హీరోతో షేర్ చేసుకున్నాడు.

Ads

కానీ ఫైనల్ గా నాని ని పెట్టి సినిమా తీశారు. అసలు ఈ స్టోరీని శ్రీకాంత్ ఓదెల రామ్ చరణ్ కోసం రాశాడు విలేజ్ నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది కాబట్టి రంగస్థలంలో చరణ్ అద్భుతంగా నటించాడని పైగా శ్రీకాంత్ ఓదెల సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. కనుక ఈ సినిమా చరణ్ కి బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కానీ పెద్ద హీరో అని.. అవకాశం ఇస్తాడో లేదో అని చరణ్ ని కలవలేదు శ్రీకాంత్ ఓదెల.

తర్వాత ఈ సినిమా కోసం నితిన్ బెస్ట్ అని అనుకున్నారు కానీ నితిన్ కొత్త కుర్రాడు అవ్వడం వలన రిజెక్ట్ చేశారు. నాని దగ్గరికి శ్రీకాంత్ ఓదెల వెళ్ళగానే డెమో షూట్ చేసి వెంటనే రమ్మని చెప్పారట. అది నచ్చడంతో ప్రాజెక్ట్ కి నాని ఓకే చెప్పేసాడు. ఇలా షూటింగ్ పూర్తి అవడం సినిమా రావడం హిట్ కొట్టడం అన్నీ వేగంగా పూర్తయిపోయాయి కానీ నితిన్ దసరా సినిమాని మిస్ చేసుకుని తప్పు చేశాడు అని నెట్టింట టాక్.

Previous articleచనిపోయిన వ్యక్తులు తరుచు కలలో కనిపిస్తున్నారా? అయితే దాని సంకేతం ఇదే..!
Next articleరామ్ చరణ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ “ఆరెంజ్” సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు ? టైటిల్ వెనక స్టోరీ..!