చాగంటి గారు ఒక ప్రవచనానికి ఎంత తీసుకుంటారు ? మొదటి సారి ఎక్కడ ఇచ్చారు ?

Ads

చాగంటి కోటేశ్వరరావు గారు తెలియని వారు ఉండరు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలకి చాలా మంది వెళుతూ ఉంటారు. ఆయన చెప్పేది విని జాగ్రత్తగా ఆచరిస్తూ ఉంటారు. అయితే చాలా మందిలో ఉండే సందేహం ఏమిటంటే.. చాగంటి ఒక ప్రవచనానికి ఎంత తీసుకుంటారు అని.. ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కాకినాడలో ఒక ప్రవచనం జరుగుతూ ఉంది అప్పుడు మాత భాగవతంలో ఒక కావ్యాన్ని చెప్పి దీని గురించి ఎవరైనా వివరించగలరా అని అడిగారట.

కేవలం ఆ ఒక్కటే కాదు దాని ముందు బాగానే వెనక భాగాన్ని కూడా ఒక వ్యక్తి లేచి చెప్పేసారు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయనకి భాగవతం మీద ఉన్న పట్టు చూసి మాత ఆశ్చర్యపోయారు.

పిలిచి మీరు సరస్వతీపుత్రులని చెప్పారు ఎంతో జ్ఞాన శక్తి మీలో ఉందని ఆమె అన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మొదట అందరికీ ఇలా తెలిసింది. రమణ మహర్షి ఆలోచన విధానాన్ని ఎంతో చక్కగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు. అలానే పురాణాలకు సంబంధించిన విషయాలని, భక్తి, దేవుళ్ళ గురించి ఇలా ఎన్నో విషయాలని చెప్తూ ఉంటారు చాగంటి కోటేశ్వరావు. ఎంతో సున్నితంగా ఆయన చెప్తూ ఉంటారు. ఆయన చెప్తూ ఉంటే అక్కడ ఉండే భక్తులు ఆయన చెప్పే విషయాలతో పూర్తి నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఎన్నో పద్యాలని కూడా ఆయన చెప్తూ ఉంటారు.

Ads

పండుగలు గురించి వాటి యొక్క విశేషత గురించి ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు చాగంటి కోటేశ్వరావు. అయితే ఈయన ప్రవచనాలు చెప్పి లక్షల రూపాయలని తీసుకుంటూ కోట్ల రూపాయలని వెనకేస్తూ ఉంటారు అని పుకార్లు కూడా వచ్చాయి. మరి చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత తీసుకుంటారు అనే విషయానికి వచ్చేస్తే.. ఆయన చెప్పే ప్రవచనాలకి డబ్బులని తీసుకోరు. ఒకవేళ ఎవరైనా ఆహ్వానించి వాళ్ళ సంతృప్తి కోసం ఎంతో కొంత తీసుకోమంటే ఒక పువ్వుతో పాటు ఒక రూపాయి ని ఇవ్వమని అంటారు. అదే తీసుకుంటారు. ఎందుకంటే దేవుడు నాకు సరస్వతి కటాక్షం ఇచ్చారు. దీనిని అమ్ముకోకూడదు అని అన్నారు. ప్రవచనం చెప్పడం ఆ దేవుడికి సేవ చేసినట్లు నేను అనుకుంటానని చాగంటి కోటేశ్వరరావు అంటుంటారు.

Previous articleరామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా కంటే ముందు RRR కోసం రాజమౌళి ఎంచుకున్న హీరోలు వీరేనా ?
Next articleచనిపోయిన వ్యక్తులు తరుచు కలలో కనిపిస్తున్నారా? అయితే దాని సంకేతం ఇదే..!