Ads
చాలామంది రాత్రిపూట వేసుకున్న బట్టల్ని మళ్లీ ఉదయాన్నే వేసుకుంటూ ఉంటారు అయితే బట్టల్ని వేసుకునేటప్పుడు మాత్రం కొన్ని తప్పులని అస్సలు చేయకూడదు. సరదాగా బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ బట్టల్ని దాచి వేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ రాత్రి పూట వేసుకున్న బట్టలు మాత్రం మళ్లీ మళ్ళీ వేసుకోకూడదు ఈ విషయం చాలా మందికి తెలియదు. రాత్రి నిద్ర పోయినప్పుడు వేసుకున్న బట్టల్ని మళ్లీ ఉదయం వేసుకోకూడదు. చాలా మందికి ఈ విషయం తెలీదు.
రాత్రి నిద్ర చేసిన బట్టల్ని ఉతకుండా మళ్ళీ వాడకూడదు ఎందుకంటే రాత్రి నిద్ర చేసిన బట్టల్ని వేసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలు వస్తాయి. మనం నిద్రించేటప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎన్నో కలలు కూడా వస్తాయి. పైగా మన శరీరం రకరకాల విసర్జనలు వదులుతూ ఉంటుంది.
Ads
మన శరీరం కూడా పెరుగుతూ ఉంటుంది పైగా ఎన్నో చెడు ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి. ఇదే కాకుండా మంచం మీద నిద్రపోయేటప్పుడు మంచం పై దుమ్ము ధూళి కూడా ఉంటుంది అవన్నీ బట్టలకి అంటుకుంటాయి. ఈ దుమ్ము వలన ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ వంటివి సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాత్రి పడుకున్నప్పుడు వేసుకునే బట్టల్ని మళ్లీ ఉదయం వేసుకోకూడదు. ఉదయం స్నానం చేసేటప్పుడు రాత్రి వేసుకున్న బట్టల్ని ఉతికేసుకోవాలి రాత్రి వేసుకున్న బట్టలకు ఎక్కువ మురికి అంటుకోదు.
కేవలం నిద్రపోతాము కాబట్టి ఆ బట్టల్ని కాస్త నీళ్లలో వేసి ఒకసారి జాడించేసుకోవడం ఉత్తమం. కనుక ఎప్పుడు ఈ తప్పు ని చేయకుండా రాత్రిపూట వేసుకున్న బట్టల్ని మరుసటి రోజు ఉదయాన్నే ఉతికేసుకోండి. దీనివలన సమస్యలు లేకుండా ఉండొచ్చు. అయితే పద్ధతి పాటిస్తే మంచిది మొదట కొంచెం కష్టంగా ఉంటుంది అదేంటి బట్టలు ఉతుక్కోవాలా ఉదయాన్నే అని.. కానీ ఒక సారి ఇలా చేస్తే రోజూ మీకు అలవాటు అయిపోతుంది.