సిమ్రాన్ కొడుకులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..? వైరల్ అవుతున్న ఫొటోస్..!

Ads

సిమ్రాన్ ఇటు తెలుగులో అటు తమిళంలో కూడా నటించి మంచి పేరును తెచ్చుకుంది. ఈమె ఉత్తరాదికి చెందిన నటి. మొట్ట మొదటి సారి సిమ్రాన్ శరత్ తీసుకు వచ్చిన అబ్బాయి గారి పెళ్లి ద్వారా సినిమాల్లోకి పరిచయమైంది. ఈమె తర్వాత తమిళ, తెలుగు, హిందీ, మలయాళ సినిమాలో నటించింది. 1999 నుండి 2004 వరకు ఈమె పెద్ద హీరోయిన్ గా కొనసాగించింది. చాలా మంది టాప్ హీరోల పక్కన నటించింది సిమ్రాన్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, హరికృష్ణ, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల తో ఈమె చాలా సినిమాలు చేసింది.

అందంతో అభినయంతో అందరినీ బాగా ఆకట్టుకుంది. తన డాన్స్ తో కూడా హీరోయిన్ల కి గట్టి పోటీని ఇచ్చేది. ఈమె కెరియర్ పీక్స్ లో ఉన్న సమయం లో పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. సిమ్రాన్ తన స్నేహితుడు దీపక్ బకాను పెళ్లి చేసుకుంది.

Ads

2003లో వీళ్ళ వివాహం అయ్యింది. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు అదిప్ ఓదో. చిన్న కొడుకు పేరు అదిత్ వీర్. తాజాగా నెట్టింట వీళ్ళ ఫ్యామిలీ ఫోటోలు షికార్లు కొడుతున్నాయి. సిమ్రాన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తోంది. చివరగా ఈమె రాకెట్రీలో కనపడ్డారు ఒక పక్క కెరియర్ ని మరో పక్క ఫ్యామిలీ ని కూడా ఈమె లీడ్ చేస్తున్నారు.

ఈమె ఫ్యామిలీ ఫొటోస్ ని అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. పెద్ద కొడుకు అదిప్ ఓదో ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే షాక్ అవుతారు. హీరోలకి ఏ మాత్రం తీసిపోడు. అంత అందంగా ఉన్నాడు సిమ్రాన్ కొడుకు. అదిప్ ఓదో మీదే ఇప్పుడు అందరి దృష్టి పడింది. హీరోగా తను ఇండస్ట్రీ లోకి వస్తాడా రాడా అని అడుగుతున్నారు.

Previous articleరాత్రి నిద్రించి విడిచిన బట్టలని మళ్ళీ వేసుకోవద్దు.. ఎందుకో తెలుసా..?
Next articleగుప్త నిధులు గుడిలో ధ్వజస్తంభం కింద ఎందుకు ఎక్కువగా దొరుకుతాయి… కారణం ఏమిటంటే..?