Ads
ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా కష్టాలు కామన్ గా వస్తూ ఉంటాయి. అయితే ఏ క్షణం కష్టం వస్తుందా అనేది ఎవరు ఊహించలేము. అప్పటివరకు ఉన్న ఆనందమంతా కూడా ఒకసారిగా పోతుంది అయినా కూడా మనం అసలు హోప్ ని వదులుకోకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్తేనే లైఫ్ లో పై స్థాయిలో ఉండగలం ప్రతి సందర్భాన్ని కూడా మనం అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకానీ కుమిలిపోతే దాని నుండి ఎలా బయటికి వస్తాము..? ఈమె జీవితంలో చాలా కష్టాలని ఎదుర్కొన్నారు. అయినా సరే జీవితంలో ముందుకు వెళ్లారు.
ఈమెను చూస్తే మనం ఎలా జీవితంలో కుంగిపోకుండా ముందుకెళ్లొచ్చు అనేది తెలుస్తుంది. వీళ్ళది కర్ణాటకలోని మంగళూరు. ఈమె తల్లిదండ్రులు బాగా చదువుకున్నారు ఉద్యోగం కూడా చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఉద్యోగాలతో బిజీ అయిపోతూ ఉంటారు. అయినా కూడా ఆమెకి చదువులో ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వాళ్ళు చెప్తూ ఉండేవారు.
స్కూలింగ్ ని వాళ్ల ప్రోత్సాహంతోనే ఈమె పూర్తి చేసింది తన తండ్రి చనిపోవడంతో బాధలు మొదలయ్యాయి. తండ్రి పోయినప్పటి నుంచి తల్లి తండ్రి అయ్యి ఆమెని నడిపిస్తున్నారు ఎంతో ధైర్యంగా ఉండాలని తల్లి నేర్పించారు. అలా తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈమె ఇంజనీరింగ్ ని పూర్తి చేశారు. బెంగళూరులో ఒక కంపెనీలో ఉద్యోగం కూడా ఈమెకి వచ్చింది తర్వాత ఒక వ్యక్తితో ప్రేమలో పడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన సంవత్సరానికే భర్త చనిపోయాడు ఆమె అప్పటికి మూడు నెలలు గర్భవతి. కొడుకు చనిపోవడంతో అత్త తట్టుకోలేక నీ వల్లే కొడుకు చనిపోయాడని నీ కడుపులో ఉన్న బిడ్డ శనిలా దాపురించిందని.. ఇలా ఎన్నో మాటలు అన్నారు.
ఆమెకి ఇంకా చాలా లైఫ్ ఉందని డాక్టర్లు అబార్షన్ చేయించుకోమని చెప్పారు అయినా కూడా ఆమె ఒప్పుకోలేదు. బిడ్డ పుట్టాక థెరపీ తీసుకుని ఆమె బయటకు వచ్చారు. ఈమె తల్లి ఎంతో బాగా చూసుకునేవారు. దాంతో ఆమె ఎంతో ధైర్యంగా ఉన్నారు ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఇంకో పక్క పాపని పెంచారు సింగిల్ పేరెంట్స్ కి ఈమె స్ఫూర్తిని ఇచ్చే విధంగా సోషల్ మీడియాలో టిప్స్ ని ఇస్తారు.
Ads
ఈమె ని చూసి ఎప్పుడు ధైర్యంగా ఉండాలని జీవితంలో ఎలాంటి బాధ వచ్చినా కూడా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుందని అర్థం చేసుకోవాలి నిజానికి ఇవన్నీ కూడా అందరూ తెలుసుకోవాలని ఆమె కథని షేర్ చేశారు.
View this post on Instagram