అంతసేపు సినిమా చూసిన ఆడియన్స్ ఫూల్స్ ఆ.? ఈ ముగ్గురు తమిళ్ డైరెక్టర్స్ బలే కవర్ చేసుకుంటున్నారుగా.?

Ads

ఈమధ్య తమిళ్ ఇండస్ట్రీలో డైరెక్టర్లు ఫ్లాపులు కొట్టి తప్పు వాళ్ళ మీదకి రాకుండా భలే కవర్ చేసి ఆడియన్స్ ని ఫూల్స్ చేస్తున్నారు. అలా సాకులు చెప్పి ఇప్పటికే ముగ్గురు డైరెక్టర్లు తప్పించుకున్నారు. భవిష్యత్తులో ఇంకెంత మంది ఇలాంటి సాకులు చెప్తారో. ఇంతకీ ఆ డైరెక్టర్లు మరెవరో కాదు. లోకేష్ కనగరాజ్, పి. వాసు, ఐశ్వర్య రజినీకాంత్.

రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2ని పి, వాసు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దీనిమీద స్పందిస్తూ పి, వాసు ‘సినిమాలో 480 ఫ్రేములు మిస్ అయ్యాయి అందుకే రిజల్ట్ తేడా కొట్టింది’ అని సాకులు చెప్తూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా రజనీకాంత్ తో ఐశ్వర్య రజనీకాంత్ తీసిన లాల్ సలాం సినిమా..ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియని పరిస్థితి. బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా సాగిన ఈ సినిమాలో అతి ముఖ్యమైన సంఘటన అయినా క్రికెట్ సీన్ల ఫుటేజ్ మిస్సయిందని, దీన్ని 21 రోజుల వరకు తీసాము, ఆ ఫుటేజ్ పోయింది అంటూ తనని తాను సమర్ధించుకుంటూ వస్తుంది ఐశ్వర్య.

Ads

lal salaam review

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా లియో సినిమా కిందటి సంవత్సరం విడుదలైంది. ఈ సినిమా ద మోస్ట్ హైప్డ్ మూవీ గా పేరుగాంచుకుంది. ఈ సినిమాకి కలెక్షన్లు బానే వచ్చినా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోయింది. సెకండ్ హాఫ్ అంతా బోర్ కొట్టింది అంటూ అభిమానులు తెలిపారు. దీనికి లోకేష్ స్పందిస్తూ ‘సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అబద్ధం కావచ్చు’ అని చెప్పాడు.

అంటే అదంతా చూసిన ఆడియన్స్ ఫూల్స్ అయినట్టేగా.ఇలా ఆడియన్స్ ని ఫూల్స్ ని చేస్తూ ఇంకెంతమంది డైరెక్టర్లు వస్తారో. ఈ కారణాలు నిజమైనప్పటికీ కూడా సినిమా విడుదల చేయకముందు వాళ్లకి కారణాలు తెలుసు కదా అలాంటప్పుడు ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకొని ఉండాల్సింది. భవిష్యత్తులో వచ్చే డైరెక్టర్లు అయినా సరైన కారణాలు వెతుక్కుంటారో లేదో మరి.

Previous articleఉదయ్ కిరణ్, సౌందర్య లానే చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన 12 నటులు..!
Next articleమూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆకస్మిక మరణం…”నీ వల్లే కొడుకు చనిపోయాడని” అత్త.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.