Ads
జనవరి నుండి డిసెంబర్ వరకు ప్రతి నెలలో చూసినట్లయితే 30 రోజుల్లో లేదా 31 రోజులు ఉంటాయి. అదే ఫిబ్రవరిలో చూస్తే 28 రోజులు కానీ 29 రోజులు కానీ ఉంటాయి. అన్ని నెలల కంటే ఫిబ్రవరి చిన్న నెల. తక్కువ రోజులే ఫిబ్రవరిలో ఉంటాయి. ప్రతి నెలలో చూస్తే 30 రోజులు కానీ 31 రోజులు కానీ ఉంటాయి కానీ ఫిబ్రవరిలో అలా కాదు. ఫిబ్రవరిలో 29 రోజులు లేదంటే 28 రోజులు మాత్రమే ఉంటాయి. దానికి గల కారణం ఏమిటి..?
ఏమైనా ప్రత్యేకత ఉందా ఫిబ్రవరి నెలలో తక్కువ రోజులు ఎందుకుంటాయి..? మిగిలిన 11 నెలల పై ఏ ప్రభావం పడకుండా కేవలం దీనిమీద ఎందుకు పడింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి 360 రోజుల ఆరు గంటలు పడుతుంది ప్రతి నాలుగేళ్లకి ఫిబ్రవరి నెలలో మరో రోజు జోడించడం ద్వారా బ్యాలెన్స్ అవుతుంది.
సూర్యుడి చుట్టూ భూమి యొక్క భ్రమణం పై ఆధారపడి ఇది ఉంటుంది మిగిలిన నెలలు అన్నిట్లో కూడా 30 లేదా 31 రోజులు ఉంటాయి. ఈ రోజుల తర్వాత ఫిబ్రవరి కి సర్దుబాటు చేయడానికి 28 రోజులు కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. అందుకని ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. నాలుగేళ్ల తర్వాత 29 రోజులవుతాయి. అయితే కేవలం ఎందుకు ఫిబ్రవరిలోనే అడ్జస్ట్ చేస్తారు..? మిగిలిన నెలలో ఎందుకు కాదు అనేది చూస్తే.. మొదట్లో సంవత్సరం అంటే 10 నెలలు మాత్రమే ఉండేవి. సంవత్సరం మార్చి నుండి మొదలు అవ్వగా సంవత్సరంలో చివరి నెల డిసెంబర్. తర్వాత మర్చి.
Ads
కానీ ఆ తరవాత జనవరి ఫిబ్రవరి నెలలు కూడా జోడించబడ్డాయి. క్రీస్తుపూర్వం 1503 లో జనవరి మొదలైంది దానికి ముందు అయితే మార్చి మొదటి సంవత్సరం మొదటి రోజు. 10 నెలలు ఒక సంవత్సరం అయినప్పుడు నెలరోజులు పెరుగుతాయి తగ్గుతాయి. తర్వాత సంవత్సరానికి రెండు నెలలు కలిపితే దానికి తగ్గట్టుగా రోజుల్ని విభజించారు.
తర్వాత ఫిబ్రవరిలో 28 రోజులు. నాలుగు సంవత్సరాలు 29 రోజులు వచ్చాయి. ఫిబ్రవరి నెలలో కనుక ఒక రోజుని పెంచకపోతే ప్రతి ఎడాది క్యాలెండర్ కంటే దాదాపు 6 గంటలు మనం ముందుంటాము. 100 ఏళ్లలో 24 రోజులు గడిచిపోతాయి. సీజన్లను నెలలతో కలపడం కష్టం. కానీ జరగకపోతే 500 సంవత్సరాల తర్వాత మే జూన్ లో రావాల్సిన సమ్మర్ సీజన్ డిసెంబర్ లో వస్తుంది. అందుకే ఇలా సర్దుబాటు చేసారు.
రోమన్ రాజు నువా పంపిలియస్ 360 రోజులని కవర్ చేయడానికి రెండు నెలలు ని అదనంగా చేర్చారు. ఆ నెలలే జనవరి. ఫిబ్రవరి సంవత్సరంలో 365 రోజులని కవర్ చేయడానికి 12 నెలలు ఉండాలి ఫిబ్రవరి నెలలో 28 రోజులు అనుకున్నారు. ఎవరైనా చనిపోయిన వారికి గౌరవించే నెలగా అనుకున్నారు రోమన్లు. తర్వాత జూలియస్ క్యాలెండర్ ని తయారు చేశారు సూర్యుడి కదలికల ఆధారంగా తయారు చేశారు ఎన్ని మార్పులు చేసిన ఫిబ్రవరిలో 28 రోజుల తోనే ప్రత్యేకంగా చేశారు.