“ఎలాగో రాజస్థాన్ గెలుస్తుంది అనుకుంటే.. చివరికి ట్విస్ట్ ఇచ్చారుగా.? ..అంటూ రాజస్థాన్ VS లక్నో మ్యాచ్ పై 10 ట్రోల్స్..!

Ads

ఐపీఎల్ 16వ సీజన్ లో బుధవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌‌ జట్టు పై లక్నో ఊహించని విధంగా విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ కి దిగిన లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది.

155 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 6 వికెట్లకు 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లలోఆవేశ్ ఖాన్, నవీన్ ఉల్ హక్ అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నో విజయానికి బాటలు వేశారు.10 పరుగుల తేడాతో రాజస్థాన్ పై లక్నో విజయం సాధించింది.
లక్నో జట్టు నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు ఛేధించలేకపోయింది.దీంతో లక్నో జట్టు 10 పరుగుల తేడాతో విజయన్ని సాధించింది. లక్ష్యం తక్కువ కావడంతో రాజస్ధాన్ జట్టు నిర్లక్ష్యం చేసింది. పవర్ ప్లేలో ఓపెనర్లు రన్స్ చేయకుండా, భారీ షాట్లు ఆడకుండా చాలా వరకు బాల్స్ వృధా చేశారు. ఇక సంజు శాంసన్, హెట్‌మేయర్ లాంటి విధ్వంసకర బ్యాట్ మెన్స్ వెంట వెంటనే ఔట్ అవ్వడం వల్ల రాజస్థాన్ ఓటమి పాలయ్యింది.
రాజస్థాన్ జట్టు ఓపెనర్లు జైస్వాల్ 35 బంతుల్లో 44 పరుగులు, జోస్ బట్లర్ 40 బంతుల్లో 40 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని ఇచ్చారు.వీరు మొదటి వికెట్‌కు 11.3 ఓవర్లలో 87 పరుగులు చేశారు.ఓపెనర్లు రాణించడంతో రాజస్థాన్ గెలిచేలా కనిపించింది. అయితే 22 బాల్స్ వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ జట్టు తడబడింది. జైస్వాల్‌ను ఔట్ చేయడం, కాసేపటికే సంజూ శాంసన్‌‌ను పూరన్ రనౌట్ చేశాడు.తరువాతి ఓవర్లో స్టోయిన్ బట్లర్‌ను పెవిలియన్ కు పంపించాడు.

Ads

అంతకు ముందు లక్నో జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితం అయ్యింది. కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 39, కైల్ మేయర్స్ 42 బంతుల్లో 51 పరుగులు చేశారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ పై, అలాగే లక్నో జట్టు గెలుపు మిమర్స్ తమ చేతికి పని చెప్పారు. దాంతో ఈ మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
1. 2.3. 4. 5. 6. 7. 8. 9.10.
Also Read: సచిన్ డైరీలో రాసుకున్న గొప్ప క్రికెటర్ విషాద గాధ..

Previous articleఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి..?
Next articleఎడమ చేతికే ఎందుకు వాచీ ని పెట్టుకోవాలి..? దాని వెనుక కథ ఏంటి అంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.