చెఫ్స్ ఎందుకు పొడవాటి హ్యాట్స్ ని ధరిస్తారు.. కారణం ఏమిటి అంటే..?

Ads

పెద్ద పెద్ద రెస్టారెంట్ల లో చూసినా మాస్టర్ చెఫ్ వంటివి చూసినా అక్కడే ఉండే చెఫ్స్ పొడవాటికి
హ్యాట్స్ ని పెట్టుకుంటూ ఉంటారు. రెస్టారెంట్లో ఉండే చెఫ్స్ ముందు హైజిన్ పై శ్రద్ధ పెడతారు. అందుకని చేతులకి గ్లౌజులు వేసుకోవడం, క్యాప్స్ ని పెట్టుకోవడం, యాప్రాన్ వంటివి ధరించడం వంటివి చేస్తారు అలానే పొడవాటి హ్యాట్స్ ని కూడా పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎందుకు అంత పొడవైన హ్యాట్ ని పెట్టుకుంటారు దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

చెఫ్స్ యొక్క హ్యాట్ పొడవని బట్టి వాళ్ళ యొక్క ర్యాంక్ ని కిచెన్ లో తెలిపేందుకు ఉపయోగిస్తారు. రెస్టారెంట్లో ఉండే ఎగ్జిక్యూటివ్ చెఫ్ పొడవటి హ్యాట్ ని ధరిస్తారు ర్యాంకింగ్ కిందకి వెళ్లే కొద్దీ హ్యాట్ యొక్క పొడవు తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక కారణం. అయితే ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. చెఫ్ లు పొడవాటి హ్యాట్ లని ధరించడం వలన సర్కులేషన్ బాగా అవుతుంది గాలి బాగా ఆడుతుంది. హీట్ బయటకి వెళ్ళిపోతుంది.

Ads

ఇలాంటి హ్యాట్ లని toque blanch అని (ఫ్రెంచ్ లో “white hat”) అని అంటారు. అలానే పొడవాటి హ్యాట్ ని పెట్టుకోవడం వలన జుట్టు రాలిపోకుండా ఉంటుంది. జుట్టు అన్నంలో పడే ఛాన్స్ ఉండదు. హైజీన్ కోసం. ఈ హ్యాట్స్ చెమటని కూడా పీల్చుకుంటాయి. అయితే రెస్టారెంట్లను బట్టి చెఫ్స్ యొక్క డ్రెస్సులు, హ్యాట్స్ వంటివి ఆధారపడి ఉంటాయి.

కొంతమంది పొడవాటి హ్యాట్స్ ని ధరించే బదులు ఎలాస్టిక్ బ్యాండ్ వుండే చిన్న క్యాప్స్ ని పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ పొడవాటి హ్యట్ల వెనక చరిత్ర చాలా ఎక్కువ ఉంది 200 ఏళ్ళ క్రితమే ఇలాంటి హ్యట్లని పెట్టుకునే వారట. పైగా కొంతమంది చెఫ్స్ కి ప్లీట్స్ లాగ ఉంటాయి అయితే ఈ ప్లీట్స్ చెఫ్ ఎన్ని రకాల స్టైల్స్ లో టెక్నీక్స్ లో వంట చెయ్యగలరు అనేది సూచిస్తుంది.

Previous articleశుక్రవారం నాడే సినిమాలని ఎందుకు ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు..? కారణం ఇదే..!
Next articleఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి..?