Ads
ఎప్పుడైనా హోటల్స్ కి కానీ రెస్టారెంట్లకు కానీ వెళ్లినప్పుడు మీరు ఈ విషయాన్ని గమనించారా..? హోటల్స్ లో రెస్టారెంట్స్ లో ఉండే వాష్ రూమ్స్ యొక్క డోర్లు కింద వరకు వుండవు. కొంచెం గ్యాప్ ని వదిలేస్తూ వుంటారు.
చాలా మందికి ఈ సందేహం ఉండే ఉండి ఉంటుంది. హోటల్స్, రెస్టారెంట్స్ వంటి చోట్ల టాయిలెట్లలో డోర్లు కింద వరకు ఎందుకు ఉండవు అని… అలానే టాయిలెట్ డోర్లు థియేటర్లలో మాల్స్ లో కూడా కింద వరకు ఉండవు. దాని వెనుక ఉన్న కారణాలు ఇవే. మరి వాటి కోసం ఇప్పుడే చూసేద్దాం.
ఎందుకు హోటల్స్, రెస్టారెంట్స్ లో టాయిలెట్స్ డోర్స్ కింద వరకు వుండవు..?
#1. పబ్లిక్ టాయిలెట్స్ లో శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఎక్కువ మంది వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. కింద వరకు డోర్ ఉండకపోవడం వలన క్లీన్ చేయడం ఈజీ అవుతుంది.
#2. అలానే ఎవరైనా సరే ఏదైనా కారణం వలన వాష్ రూమ్ లో పడిపోయినట్లయితే చూడడానికి ఈజీ అవుతుంది. అందుకని డోర్ ఫుల్ గా కింద వరకు ఉండదు.
#3. పైగా వెంటిలేషన్ కి కూడా ఈజీ అవుతుంది.
#4. వాష్ రూమ్స్ నుండి వచ్చే వాసన బయటికి ఈజీగా వెళ్ళిపోతుంది.
Ads
#5. ఎక్కువ వాష్ రూమ్స్ ఉంటాయి. వీటి కోసం ఎక్కువ ప్లాన్ చేయాలి.. ఎక్కువ మెటీరియల్ వాడాలి.. ఒకవేళ కనుక షార్ట్ గా కట్టేస్తే తక్కువ ఖర్చు అవుతుంది. పొడుగ్గా కడితే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది కదా అందుకనే డోర్ కింద వరకు ఉంచరు.
#6. పైగా ఫుల్ గా డోర్ ఉండడం వలన ఆ ప్రైవసీని వాడుకుని కొందరు దుర్వినియోగం చేయొచ్చు.
#7. గ్యాప్ ఉంటే వాష్ రూమ్ లో ఉన్న వాళ్ళకి ఎవరైనా వాష్ రూమ్ ని వాడడానికి వెయిట్ చేస్తున్నారు అని తెలుస్తుంది.
#8. ఎప్పుడైనా డోర్ కనుక స్ట్రక్ అయిపోయినా.. ఏదైనా ఇబ్బంది వచ్చినా.. బయటికి రావడానికి వీలుగా కూడా ఉంటుంది.