మొన్నటి వరకు ఆరోగ్యంగా కనిపించిన “సూర్య కిరణ్” ఇంత హఠాత్తుగా ఎలా చనిపోయారు..? కారణం ఇదేనా..?

Ads

ప్రముఖ డైరెక్టర్ సూర్య కిరణ్ ఇవాళ తుది శ్వాస విడిచారు. చెన్నైలో ఆయన మరణించారు. సూర్య కిరణ్ తమిళ వారు అయినా, కూడా తెలుగు వారికి సుపరిచితులు. ఎన్నో సినిమాలకి దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాల్లో నటించారు.

సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాకి సూర్య కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. సూర్య కిరణ్ సోదరి సుజిత చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో, ఇప్పుడు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు.

reason behind surya kiran demise

అంతే కాకుండా, కొన్ని సినిమాలకి డబ్బింగ్ కూడా అందిస్తున్నారు. సూర్య కిరణ్, హీరోయిన్ కళ్యాణి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కళ్యాణి సినిమాలకు దూరం అయిపోయారు. కానీ సూర్య కిరణ్, కళ్యాణి విడిపోయినట్టు తర్వాత ప్రకటించారు. కొంత కాలం సూర్య కిరణ్ కూడా సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో ఒక కంటెస్టెంట్ గా అడుగు పెట్టారు. వచ్చిన కొద్ది రోజులకే సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత బిగ్ బాస్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ లో కూడా సూర్యకి రణ్ కనిపించారు. ఇదంతా జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది.

reason behind surya kiran demise

Ads

ఆ తర్వాత కొన్ని ఈవెంట్స్ లో సూర్య కిరణ్ కనిపించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా సూర్య కిరణ్ మరణించినట్టు ప్రకటించారు. సూర్య కిరణ్ చనిపోవడానికి పచ్చకామర్లు కారణం అని తెలుస్తోంది. గత కొంత కాలంగా సూర్యకిరణ్ పచ్చకామర్లతో బాధపడుతున్నారు. అది పెరగడంతో సూర్య కిరణ్ చనిపోయారు. చెన్నైలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్యకిరణ్ చనిపోయినట్టు తెలుస్తోంది. సూర్యకి రణ్ మృతి పట్ల ఎంతో మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

reason behind surya kiran demise

సూర్య కిరణ్ 1986 లో చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు సినిమాలో నటించారు. అంతకుముందు 1978 లో స్నేహిక్కన్‌ ఓరు పెన్ను అనే ఒక మలయాళం సినిమాలో కూడా నటించారు. తర్వాత కన్నడ, తమిళ సినిమాల్లో నటించి, తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన రాక్షసుడు సినిమాలో నటించారు. ఆ తర్వాత, దొంగ మొగుడు, ఖైదీ నెంబర్ 786, కొండవీటి దొంగ, సంకీర్తన సినిమాల్లో కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

reason behind surya kiran demise

సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాతో సూర్య కిరణ్ దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత సుమంత్ తో ధన 51, జగపతిబాబు హీరోగా బ్రహ్మాస్త్రం సినిమాలకి దర్శకత్వం వహించారు. మనోజ్ నటించిన రాజుభాయ్, ఆ తర్వాత చాప్టర్ 6 అనే సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చారు. మొదటి వారంలోనే సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ లో, కొన్ని ఈవెంట్స్ లో కనిపించారు.

ALSO READ : వెంకటేష్ ”నువ్వు నాకు న‌చ్చావ్” మూవీని ఎన్నోసార్లు చూసినా ఈ మిస్టేక్ ని గ‌మ‌నించ‌లేదు..!

Previous articleహోటల్స్, రెస్టారెంట్స్ లో టాయిలెట్స్ డోర్స్ కింద వరకు ఉండకపోవడానికి.. 8 కారణాలివే..!
Next articleకబడ్డీ కబడ్డీ సినిమా హీరోయిన్ “కళ్యాణి” ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారంటే..?