“అనంత్ అంబానీ” కంటే ముందు… “రాధిక మర్చంట్” ప్రేమించిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..? అంబానీ సెలబ్రేషన్స్ లో కూడా ఇతను ఉన్నారా..?

Ads

ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన వేడుకలు ఇటీవల ఎంత ఘనంగా జరిగాయో అందరికీ తెలిసిందే. ప్రపంచం అంతా కూడా ఈ వేడుకల గురించి మాట్లాడుకున్నారు. కేవలం మూడు రోజులకి 1200 కోట్లు ఖర్చు పెట్టారు అంటే చిన్న విషయం కాదు కదా.

బాలీవుడ్ నుండి ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకల్లో డాన్స్ చేశారు. దాదాపు 2000 కి పైగా వంటకాలు వడ్డించారు. అతిథి మర్యాదల్లో ఏమాత్రం లోటు రాకుండా చూసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దాదాపు ఏడు సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ ఒకరికి ఒకరు చిన్నప్పటినుండి తెలుసు. అయితే రాధిక మర్చంట్, అనంత్ అంబానీ కంటే ముందు మరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అతని పేరు రోహన్ మల్హోత్రా. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. 2013 లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. విడిపోయాక కూడా వీళ్ళిద్దరూ స్నేహితులుగా ఉన్నారు.

radhika merchnt rohan malhotra story

Ads

మొన్న జరిగిన వేడుకల్లో రోహన్ మల్హోత్రా కూడా పాల్గొనడం మాత్రమే కాకుండా, వీరిద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్స్ తో కలిసి పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. కానీ ఎంతైనా సెలబ్రిటీలు కాబట్టి ఇలాంటి విషయాలు గోప్యంగానే ఉంచుతారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళిద్దరి ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. వీళ్ళిద్దరూ కాలేజ్ సమయంలో స్నేహితులు అని ఫోటోలు చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ ఫోటోల్లో వీరితో పాటు అన్మోల్ అనే మరొక స్నేహితుడు కూడా ఉన్నారు.

radhika merchnt rohan malhotra story

అంతే కాకుండా, రోహన్ మల్హోత్రా చేసిన ఒక పోస్ట్ కింద రాధిక కామెంట్స్ కూడా ఉన్నాయి. రోహన్ మల్హోత్రా ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో రాధిక మర్చంట్ ని ఫాలో అవుతున్నారు. సాధారణంగా చాలా మంది ప్రేమ తర్వాత ఒకరిని ఒకరు ద్వేషించుకుంటారు. కానీ అలా కాకుండా, వీళ్ళు ఇప్పటికి కూడా ఆరోగ్యకరంగా స్నేహితులుగా ఉండడం అనేది చాలా మంచి విషయం. దాంతో వారు ఎంత పరిణితి చెందినవారు అనేది అర్థం అవుతోంది.

ALSO READ : గృహిణులు చేసే ఈ ఒకే ఒక్క తప్పు వల్ల వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా..? అదేంటంటే..?

Previous articleఆహాలో రిలీజ్ అయిన ఈ నందమూరి హీరో కొత్త సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?
Next articleహోటల్స్, రెస్టారెంట్స్ లో టాయిలెట్స్ డోర్స్ కింద వరకు ఉండకపోవడానికి.. 8 కారణాలివే..!