Ads
సినిమాలని భారీ ఎక్స్పెక్టేషన్స్ తోనే రిలీజ్ చేస్తూ ఉంటారు డైరెక్టర్లు. అయితే అన్ని సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండవు కొన్ని సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ ని దాటి ఉంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువగానే ఉంటాయి. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత సినిమా బాలేదని టాక్ తెచ్చుకుంటూ ఉంటాయి కానీ సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతాయి.
అదే మరి కొన్ని సినిమాలను చూసుకుంటే పీక్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంటారు కానీ ఫట్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ సినిమాల మీద కాంట్రవర్సీలు విపరీతంగా వచ్చాయి. అయినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని, పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నాయి ఈ సినిమాలు. ఇక మరి ఆ సినిమాల జాబితా చూద్దాం.
పటాన్:
షారుఖ్ ఖాన్ దీపిక కాంబినేషన్లో వచ్చిన పటాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీరే చూసి ఉంటారు. ఈ సినిమాని బ్యాన్ చేయాలని కొన్ని రోజులు పాటు ఎన్నో డిబేట్ లు జరిగాయి పోస్టర్లని కూడా చింపేశారు అయితే ఈ సినిమాలో దీపిక ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటుంది. అందుకని ఈ సినిమాని బ్యాన్ చేయాలని అన్నారు. కానీ ఈ సినిమా 1000 కోట్లు నీ వరల్డ్ వైడ్ గా రాబట్టింది.
ది కేరళ స్టోరీ:
ఈ సినిమాని కూడా బ్యాన్ చేయాలని ఎంతగానో ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు కాశ్మీరీ
ఫైల్స్ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఏ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి కూడా నెగిటివ్ గా ఎన్నో వ్యాఖ్యలు చేసారు. ఈ టాపిక్ పీఎం వరకు కూడా వెళ్ళింది అయితే ఈ సినిమా ఎనిమిది కోట్లని కలెక్ట్ చేసింది.
Ads
ది కాశ్మీరీ ఫైల్స్:
ఈ సినిమాకి కూడా అదే జరిగింది. ఈ సినిమాలో ఫ్యాక్ట్స్ చూపించలేదని ఈ సినిమా రిలీజ్ అవ్వకూడదు అని చాలామంది ట్రై చేశారు అయినప్పటికీ సినిమా చాలా మంచి హిట్ అయింది. సినిమా బడ్జెట్ కంటే పది రెట్లు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.
పద్మావత్:
ఈ సినిమా ఎంతో పెద్ద కాంట్రవర్సీ అయింది చాలామంది ఈ సినిమాని బ్యాన్ చేయాలని అన్నారు. పద్మావత్ పేరు పోయేలా సినిమా ఉందని ఒక పుకారు కూడా షికార్లు కొట్టింది అయినప్పటికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది.
పీకే:
పీకే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది మొదట్లో ఈ సినిమా మీద కూడా రూమర్స్ వచ్చాయి.కాంట్రవర్సీ ఎలా ఉన్నా మూవీలో ఉన్న కంటెంట్ అందర్నీ బాగా ఆకర్షించింది ఈ సినిమా కూడా మంచి టాక్ ని అందుకుంది.
అర్జున్ రెడ్డి:
అర్జున్ రెడ్డి సినిమా గురించి కూడా ఎన్నో స్ప్రెడ్ అయ్యాయి మహిళలని కించపరిచేలా ఉన్నాయని.. ఇలాంటి పురుషుల తీరుని ప్రోత్సహిస్తున్నారని.. యువతని తప్పుదారిలో పట్టిస్తున్నారని ఇలా చాలా జరిగాయి. ఈ తెలుగు సినిమాకి చేసిన రచ్చ ఇంక ఏ మూవీకి అప్పట్లో జరగలేదు ఏదేమైనా ఈ సినిమాకి మంచిగానే కలెక్షన్లు వచ్చాయి.
ది దర్టీ పిక్చర్:
సిల్క్ స్మిత మీద వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ చాలా మందికి నచ్చలేదు ఈ సినిమాను బ్యాన్ చేయాలని అన్నారు కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ చాలా మందికి నచ్చింది.