“శ్రీకృష్ణ దేవరాయలు” తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే..!

Ads

శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యానికి మంత్రిగా సాళువ తిమ్మరుసు ఉండేవారు. ఆయనని అప్పాజీ అని ముద్దుగా పిలిచేవారు శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయల సవతి సోదరుడు రాజు తుళువ నర్సింహ రాయల చనిపోయాక రాజుగా అప్పాజీ రాయలను చేసారు. అనారోగ్యంతో ఉన్న రాజు తుళువ నర్సింహ రాయల చిన్న కుమారుడిని రాజును చేయాలనే ఉద్దేశ్యంతో కృష్ణదేవ రాయలను అంధుడిగా చెయ్యమంటాడు.

తిమ్మరుసుతో. సమర్ధుడైన పాలకుడిగా కృష్ణరాయలను భావించి మేక కళ్ళను తెచ్చి రాజుకు కృష్ణరాయల కళ్ళుగా చూపిస్తే అప్పుడు ఆ రాజు ప్రశాంతంగా మరణించాడు. ఆ తరవాత కృష్ణదేవరాయ చక్రవర్తిగా చేశాడు. అప్పాజీ సహకారంతో కృష్ణదేవరాయ గొప్ప చక్రవర్తి అయ్యారు. తిరుమల దేవి, చిన్నాదేవి అనే ఇద్దరు భార్యలు శ్రీకృష్ణ దేవరాయలకు.

ప్రతాపరుద్ర గజపతిని యుద్ధం లో ఓడించాక ఆయన కూతురైన తుక్కా దేవిని మూడవ భార్యగా స్వీకరించాడు. ఈమె ని లక్ష్మీదేవి, జగన్మోహిని అని కూడా పిలిచేవారు. ఆమె తో పాటు ఆమె పినతండ్రి కూడా వస్తాడు. విజయనగరం మీదకు బహుమనీ సుల్తానులు దండేతిన సమయంలో… గజపతులకు విజయనగర సామ్రాజ్యం దక్కాలని ఆ ఉద్దేశ్యం తో.. కుట్రతో లక్ష్మీ పినతండ్రి పన్నాగం పన్నుతాడు.

Ads

మహామంత్రి తిమ్మారుసును రాజ్యానికి దూరం చేస్తే అది అవుతుందని అనుకున్నాడు. దీనిలో భాగంగా రాయలు యుద్ధానికి వెళ్లే పట్టాభిషేకం కుమారుడు తిరుమల రాయలకు చేయమని కుమార్తె లక్ష్మి తో చెప్పిస్తాడు. అప్పాజీని అడిగి నిర్ణయం తీసుకుందాము అని చెప్పినా మళ్ళీ మళ్ళీ అడగడం వలన పట్టాభిషేకానికి రాయలు ముహూర్తం నిర్ణయిస్తారు. తిమ్మరుసు మీద రాజద్రోహం ముద్ర వేస్తారు.

గజపతుల నుండి విషం తీసుకు వచ్చి చిన్నపిల్లవాడైన తిరుమల రాయలకు దాన్ని తాగిస్తారు.  ఆ పిల్లవాడిని తిమ్మరుసు ఉన్న ప్రదేశంలో వదిలేయగా తిమ్మరుసు తిరుమల రాయలను ఎత్తుకుని వెళ్తూ ఉండగా చనిపోతాడు. లక్ష్మీ పినతండ్రి తిరుమల రాయలను చంపింది తిమ్మారుసు అంటారు. తిరుమల రాయలను ఎత్తుకుని ఏమైనా సాక్ష్యం ఉందా అంటారు. తిమ్మారుసుకి గజపతులు అంటే పగ. పైగా లక్ష్మీ కుమారుడు రాజు అవడం ఇష్టం లేదు అందుకే చంపాడని చెప్తాడు.

మిమ్మల్ని చంపానని చెప్పి రాజును ఎలా చేశాడో మీ కొడుకుని చంపి మీ తమ్ముడు అచ్యుత రాయలను రాజును చేయాలనుకుంటున్నాడు అంటారు. ఇక ఇవన్నీ నమ్మి తిమ్మారుసును బంధించమని అంటాడు. రాజద్రోహంగా భావించి రెండు కళ్ళు పొడిచేయమని ఆజ్ఞాపిస్తాడు. కానీ కొన్నాళ్ళకి నిజం తెలుస్తుంది. తిమ్మరుసుని క్షమించమని రాజ్యానికి తీసుకురాగా.. ఇక మంత్రిగా ఉండలేనని తిరుపతికి వెళ్ళి చివరి రోజులు గడిపాడు. తప్పు చేశాననే తీవ్ర వేదనతో అనారోగ్యం పాలయ్యారు రాయలు.

 

Previous articleభీమ్లా నాయక్ హిట్ ని కొట్టలేకపోయిన ఆది పురుష్ ట్రైలర్.. తక్కువ టైంలో 100K లైక్స్ వచ్చిన 10 సినిమాలు.
Next articleరిలీజ్ అవ్వక ముందు కాంట్రవర్సరీకి గురై.. బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న 7 సినిమాలు ఇవే..!