“విజయ్ ఆంటోని” బిచ్చగాడు 2 స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Ads

బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి మరో సారి విజయ్ అంటోనీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడు. బిచ్చగాడు 1 మీరు ని చూసే వుంటారు. పైగా బిచ్చగాడు 1 అందరికీ నచ్చింది కూడా. ఇప్పుడు అందుకే సీక్వెల్ ని తీసుకు వచ్చాడు విజయ్. మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు, తమిళ్ లో చక్కటి పాటలు ఇచ్చాడు విజయ్. తరవాత హీరోగా, డైరెక్టర్ గా వచ్చి అందరినీ ఆకట్టుకుంటూనే వున్నాడు.

చిత్రం : బిచ్చగాడు 2
నటీనటులు : విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి.                                              దర్శకత్వం : విజయ్ ఆంటోనీ                                                                                              నిర్మాత : ఫాతిమా విజయ్ అంటోనీ
సంగీతం : విజయ్ అంటోని
విడుదల తేదీ : మే 19, 2023

స్టోరీ :

భారతదేశం మొత్తంలోనే ఏడవ ధనవంతుడు విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని). విజయ్ దగ్గర వాళ్లల్లో ఒకరు విజయ్ ఎదుగుదలని అడ్డుకోవాలని అనుకుంటారు. ఈ సమయంలో విజయ్ కి బ్రెయిన్ ఇంప్లాంటేషన్ జరుగుతుంది. ఈ బ్రెయిన్ సత్య అనే అతనిది.

బ్రెయిన్ ఇంప్లాంటేషన్ అయ్యాక విజయ్ తీరు అంతా మారుతుంది. సత్యలాగా ఆలోచించడం మొదలు పెడతాడు విజయ్. సత్యకి కూడా ఓ స్టోరీ ఉంటుంది. అయితే అసలు సత్య ఎవరు? అతని కథ ఏంటి? ఎలాంటి సంఘటనలు విజయ్ ఎదురుకోవాల్సి వస్తుంది.. ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ:

బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి విజయ్ అంటోనీ మరో సారి వచ్చాడు. బిచ్చగాడు 1 మీరు అంతా చూసే వుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు, తమిళ్ లో చక్కటి పాటలు ఇచ్చాడు విజయ్. ఆ తరవాత హీరోగా తరవాత డైరెక్టర్ గా అందరినీ ఆకట్టుకుంటూనే వున్నాడు. బిచ్చగాడు 1 అందరికీ నచ్చింది. అందుకే సీక్వెల్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా చూశారు.

Ads

మూవీ స్టార్టింగ్ ఏ చాలా ఆసక్తిగా స్టార్ట్ అయింది. సినిమా మొదలైన 15 నిమిషాలకే కథపైనే దృష్టి పెట్టి తీశారు. మెయిన్ పాయింట్ ని కూడా ముందే చూపించేసారు. స్టోరీ ఉందని అందరికీ ఆసక్తి మొదలు అవుతుంది. అయితే ఈ మూవీ ఇంటర్వెల్ వరకు ఆసక్తికరంగా వుంది. కానీ ఆ తరవాత మాత్రం రొటీన్ సినిమా అవుతుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది.

సెకండ్ హాఫ్ మాత్రం కాస్త బోర్ కొడుతోంది. ఈ సినిమా లో కూడా మొదటి పార్ట్ లాగే తల్లి సెంటిమెంట్ వుంది. మొదటి భాగంలో ఉన్న స్టోరీకి దీనికి మాత్రం కనెక్షన్ ఏమి లేదు. సినిమా కాన్సెప్ట్ బాగుంది కానీ స్క్రీన్ మీద సరిగా చూపించలేదు.

స్టోరీ కూడా రొటీన్ గా ఉంటుంది. యోగి బాబు వంటి యాక్టర్ల ని పెట్టారు కానీ సరిగ్గా పాత్ర ని ఇవ్వలేదు. ఈ మూవీ క్లైమాక్స్ లో కొంచెం ఎమోషన్ ని మిక్స్ చేసారు. విజయ్ ఆంటోనీ నటన గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. హీరోయిన్ పాత్ర కూడా రొటీన్ గా వుంది.

ప్లస్ పాయింట్స్:

ఎమోషన్స్                                                                                                          ఎంచుకున్న పాయింట్
సినిమా మొదటి గంట                                                                                                బీజీఎమ్                                                                                                          సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్
చాలా అతిగా అనిపించే సీన్స్
గ్రాఫిక్స్
రొటీన్ గా సాగే స్క్రీన్ ప్లే

రేటింగ్: 3/5

Previous articleరిలీజ్ అవ్వక ముందు కాంట్రవర్సరీకి గురై.. బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న 7 సినిమాలు ఇవే..!
Next articleతెలుగు, కన్నడ భాషల లిపి చూడడానికి ఒకేలా ఎందుకు ఉంటుంది..? కారణం ఏమిటి..?