Ads
చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలని కలలు కంటూ ఉంటారు. అయితే కలలు కన్నంత మాత్రాన విజయం సాధించగలరని చెప్పలేము. ఎంతో మంది ప్రయత్నం చేస్తే కేవలం తక్కువ మంది మాత్రమే కలని నెరవేర్చుకోగలరు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు అవ్వాలంటే ఎంతో శ్రమించాలి.
ఒకవేళ కనుక శ్రమించి అధికారులైతే మాత్రం సంఘంలో ఎంతగానో గౌరవం ఉంటుంది. ఇదిలా ఉంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు ఎంత జీతం ఇస్తారు..?, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం..
భారతదేశంలో నిర్వహించే అత్యంత కఠినమైన పోటీ పరీక్ష ఈ యుపిఎస్సి పరీక్ష. యూపీఎస్సీ పరీక్షల్లో మంచి మార్కులు రావడం అంత ఈజీ కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మొదలు మొత్తం 24 సివిల్ సర్వీసెస్ లో కలిపి దాదాపు 1000 ఖాళీల కోసం సుమారు పది లక్షల మంది వరకు పోటీ పడుతూ ఉంటారు.
అయితే పౌర సేవలు అనేవి మూడు విభాగాలుగా విభజించారు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్, సెంట్రల్ సివిల్ సర్వీస్, స్టేట్ సివిల్ సర్వీస్. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వచ్చేసే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ వంటివి భాగాల్లో ఉంటాయి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నేరుగా భారత ప్రభుత్వ పరిపాలన శాశ్వత బ్యూరోక్రసికి సంబంధించినదనమాట.
రాష్ట్ర సివిల్ సర్వీసెస్ రాష్ట్ర సంబంధిత సమస్యలతో వ్యవహరించడం జరుగుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ కి ప్రారంభ జీతం 56,100. ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ అయ్యాక 1,31,249 లేదంటే ఏడాదికి 15.75 లక్షలు ఇస్తారు. ఐఏఎస్ గరిష్ట వేతనం రూ.2,50,000. ఏడవ వేతన కమిషన్ కింద బేసిక్ వేతనంగా 56,100 తో పాటుగా ట్రావెలింగ్ అలవెన్స్ తో పాటుగా ఇతర అలవెన్స్ లు ఉంటాయి.
Ads
క్యాబినెట్ సెక్రటరీ పదవికి చేరుకుంటే దాదాపు 2.5 లక్షల రూపాయలు జీతం గా ఇస్తారు. అయితే నాలుగో సంవత్సరం వరకు పనిచేస్తే 56,100 ఇస్తారు. ఐదవ సంవత్సరం నుండి ఎనిమిదవ సంవత్సరము వరకు డిప్యూటీ సెక్రటరీ, అండర్ సెక్రెటరీ పోస్టుల్లో పనిచేస్తారు ఆ సమయంలో వాళ్ళకి 67,700 జీతం ఇస్తారు. పదవి కాలం బట్టి జీతం పెరుగుతూ ఉంటుంది ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి.
34వ ఏడాది నుండి 36 దాకా చీఫ్ సెక్రటరీగా పని చేయాలి. అయితే ఇక్కడ రూ.2.5 లక్షల వేతనం ఇస్తారు. 37 ఏళ్లకు పైగా కెరీర్ ఉంటే క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా పోస్ట్ ఇస్తారు. పే బ్యాండ్ ఆధారంగా ఐఏఎస్ అధికారులకు ఇల్లు, వంట మనిషి, గృహ సంబంధిత సిబ్బందితో పాటు ఇతర ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఏ విభాగంలో అయినా సరే ఐఏఎస్ అధికారికి ప్రభుత్వ గృహం కేటాయిస్తారు. పైగా ఎక్కడికైనా వెళ్లడానికి కారు డ్రైవర్ కూడా ఉంటారు.
ఐపీఎస్ అధికారి జీతం:
ఐపీఎస్ అధికారికి ప్రారంభ వేతనం 56,100. ఎనిమిది సంవత్సరాలు సర్వీస్ తర్వాత 1,3100 లేదంటే సంవత్సరానికి 15.75 లక్షలు. ఐపీఎస్ గరిష్ట వేతనం 2,25,000.
ఐఎఫ్ఎస్ అధికారి జీతం (Indian forest service):
ప్రారంభ వేతనం 15,600 నుండి 39,100. 20 ఏళ్ల సర్వీస్ తర్వాత నెలకి 37,400 నుండి 67,000. గరిష్ట వేతనం 90,000.
ఐఎఫ్ఎస్ అధికారి జీతం (Indian Foreign service):
ఇందులో కనుక సెలెక్ట్ అయితే నెలకి 60,000 వరకు ఇస్తారు. టీఏ, డీఏ, హెచ్ ఆర్ ఏ అదనంగా ఉంటాయి.