తెలుగు, కన్నడ భాషల లిపి చూడడానికి ఒకేలా ఎందుకు ఉంటుంది..? కారణం ఏమిటి..?

Ads

తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా కన్నడ భాషని చదవగలరు. బెంగళూరు లేదా ఏదైనా కర్ణాటక కి చెందిన ప్రాంతానికి వెళితే అక్కడ ఉండే కన్నడ అక్షరాలని చాలామంది చదివేస్తూ ఉంటారు. పైగా క్లియర్ గా అదేంటి అనేది తెలిసిపోతుంది. తెలుగు వాళ్ళకి అయితే తెలుగు, కన్నడ భాషలు ఒకేలా ఎందుకు ఉంటాయి..? ఒకప్పుడు ఈ రెండు భాషలు ఒకటేనా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం…

కన్నడ, లిపి తెలుగు లిపి చూడడానికి ఒకేలా ఉంటాయి. అందుకనే మనం కన్నడ అక్షరాలని సులభంగా చదవగలము. రెండు లిపి కాస్త దగ్గరగా ఉంటాయి. ప్రపంచం లో ప్రతి భాషకు కూడా చరిత్ర ఉంది. వాటి మూలాలు ఆధారంగా భాషలను కుటుంబాలుగా విడతీశారు. అయితే భారత్‌ లో ప్రధానంగా ఐదు భాషా కుటుంబాలు కనపడతాయి.

ఇండో యూరోపియన్: సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, గ్రీక్, లాటిన్. ద్రవిడియన్: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గోండి, కోయ. ఆస్ట్రో-ఏసియాటిక్: సంతాళి, ముండారి, సవర, ఖాశీ. టిబెటో-బర్మీస్: మణిపురి, బోడో, త్రిపురి, టిబెటన్. సెమిటో హామిటిక్: అరబిక్/అరబి. ద్రావిడ భాషా కుటుంబం గురించి తెలిస్తే తెలుగు, కన్నడ భాషల మధ్య పోలికలు తెలుస్తాయి.

Ads

ప్రధానమైన భాషా కుటుంబాల్లో ద్రావిడ ఒకటి. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వంటి భాషలు అన్నీ కూడా ఈ కుటుంబంవే. ఈ కారణంగానే వీటిని ద్రావిడ భాషలు అంటారు. భద్రిరాజు కృష్ణమూర్తి ప్రముఖ భాషా శాస్త్రవేత్త. ఆయన చెప్పిన దాని ప్రకారంము 26కు పైగా ద్రావిడ భాషలున్నాయి. నాలుగు గ్రూపులుగా విభజించారు వీటిని.

అవే దక్షిణ ద్రావిడ భాషలు, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు, ఉత్తర ద్రావిడ భాషలు. తమిళం, మలయాళం, కన్నడ, ఇరుళ, కురుంబ, కొడగు, తోడ, కోట, బడగ, కొరగ, తులు ఇవన్నీ కూడా దక్షిణ ద్రావిడ భాషలు కి చెందినవి. అయితే కొన్ని మూలాలు వీటికి వున్నాయి. మూల దక్షిణ ద్రావిడం, మూల మధ్య ద్రావిడం, మూల ఉత్తర ద్రావిడం, మూల ద్రావిడం ఇలా వీటి నుంచి పుట్టుకొచ్చాయి.

తెలుగు, కన్నడ భాషలు ఒకే మూలం నుంచి రావడం జరిగింది. ఈ కారణంగానే రెండు భాషల మధ్య లిపి, నిర్మాణం కాస్త దగ్గరగా ఉంటుంది. బ్రాహ్మి లిపి నుండి ఇండో-ఆర్యన్, ద్రావిడ భాషల లిపి వచ్చాయి. అశోకుని తరువాత రెండు వేల సంవత్సరాల కాలంలో ఈ బ్రహ్మి లిపి లో రకరకాల మార్పులు వచ్చాయి. ఈ లిపి నుండి ఉత్తర, దక్షిణ, పశ్చిమ బ్రాహ్మి ఈ మూడు శాఖలు వచ్చాయి.

దక్షిణ బ్రాహ్మి శాఖ లో రెండు రకాల లిపిలు ప్రధానంగా ఉన్నాయి. అవే తెలుగు-కన్నడ, తమిళం-మలయాళం. ఇప్పటి తెలుగు, కన్నడ లిపిలకు మూలం ఈ తెలుగు-కన్నడ లిపి ఏ. ఎప్పుడో శబ్దం పరంగా తెలుగు, కన్నడం విడిపోయాయి. ఈ విడిపోవడం అనేది సుమారు 500 ఏళ్ల కిందట జరిగింది.

Previous article“విజయ్ ఆంటోని” బిచ్చగాడు 2 స్టోరీ, రివ్యూ & రేటింగ్…!
Next articleఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి ఎంత జీతం వస్తుంది…?