Ads
పెళ్లి తర్వాత రెండు కుటుంబాలు ఒకటవుతాయి. పెళ్లి తరవాత ఇద్దరు వ్యక్తులు ప్రేమానురాగాలని పంచుకుంటూ… తోడు నీడై ఉంటారు. నిజానికి పెళ్ళికి ప్రాముఖ్యత ఎంతో ఉంది. హైందవ సంప్రదాయం ప్రకారం చేసే పెళ్లికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు.
ఎవరి ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా వాళ్ళు వివాహాన్ని చేస్తూ ఉంటారు. కానీ రోజు రోజుకీ ఆచారాలని సంప్రదాయాలని పక్కన పెట్టేసి ఎవరికి నచ్చిన రీతి లో వాళ్ళు పెళ్లిళ్లు చేస్తున్నారు.
అయితే పెళ్లి లో చాలా ముఖ్యమైన తంతులు ఉన్నాయి. సప్తపది మొదలు అన్ని తంతులని కూడా అనుసరించాలి. పెళ్ళికి బాసికం కూడా చాలా ముఖ్యమైనది అని పండితులు అంటున్నారు. అయితే అసలు ఎందుకు బాసికాన్ని కడతారు..? దీని వెనుక కారణం ఏమిటి అని సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి ఈరోజు మనం వివాహంలో ముఖ్యమైన అంశమైన బాసికాన్ని ఎందుకు కడతారు..? వధూవరులు ఇద్దరికీ ఎందుకు కట్టాలి అనేది చూద్దాం. దీని వెనక ఆధ్యాత్మికమైన శాస్త్రీయపరమైన కొన్ని కారణాలు ఉన్నాయి. అలానే కొన్ని లాభాలు కూడా ఉన్నాయని పెద్దలు అంటున్నారు.
Ads
మనకి మొత్తం 72 వేల నాడులు ఉంటాయి. వాటిలో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవట. ఇవేం చేస్తాయంటే మన శరీరం ని అన్ని సమయాల్లోనూ చురుకుగా పని చేసేలా చేస్తాయి. దీనితో మనం అన్ని వేళలా కూడా ఉత్తేజంగా ఉండగలం. అలానే ఈ పద్నాగులో మళ్ళీ మూడు నాడులు ముఖ్యమైనవి. అవే పింగళ,సుషుమ్మ, ఇడ. సుషుమ్న నాడి కి సూర్యనాడి కుడి పక్కన ఉంటుంది. ఎడమ వైపునేమో చంద్రనాడి ఉంటుంది. అయితే మన నుదుటి భాగంలో ఈ రెండు నాడులు కలిస్తే అప్పుడు అర్థ చంద్రాకారం ఏర్పడుతుంది. అయితే ఈ భాగం ని దివ్యచక్షువు అని మన ఋషులు అనేవాళ్ళు. నుదుట భాగం ని బ్రహ్మ వుంటారు. అయితే ఇతరుల దృష్టి పడకూడదని కీడు సోకకూడదని నుదుట ని బాసికాలు కడతారు. ఇలా పెళ్లి నాడు కడితే కష్టం రాదని.. ఇతరుల దృష్టి పడదని పెద్దలు అంటారు.