భర్తలతో సమానంగా సంపాదిస్తున్న 7 మంది హీరోల భార్యలు…ఎవరు ఏ వృత్తిలో అంటే.?

Ads

సౌత్ హీరోలు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇంకా స్టార్ హీరోలు సినిమాకు వచ్చే లాభాల్లో వాటాలను తీసుకుంటున్నారు. ఇంకా కొంతమంది హీరోలు అయితే డిజిటల్ రైట్స్ లో వాటాలు తీసుకుంటున్నారు. నార్త్ హీరోలనే మించిపోతున్నారు.

ఇక హీరోలు మాత్రమే కాకుండా హీరోల భార్యలు కూడా బాగానే సంపాదిస్తున్నారు. మేము భర్తల కంటే తక్కువేం కాదని నిరూపించుకుంటున్నారు. వారు సినిమాల్లో నటించట్లేదు కానీ వారికి ఇష్టమైన రంగాలలో రాణిస్తున్నారు. ఇక ఏ హీరో భార్య ఎంత సంపాదిస్తుందో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే రండి చూద్దాం..
నాని భార్య అంజనా

ఈ లిస్టులో టాప్ లో ఉన్నది నేచురల్ స్టార్ నాని భార్య అంజనా. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌. బెంగళూర్ లోని నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసి, రాజమౌళి ఆర్కా మీడియా సంస్థలో క్రియేటివ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పని చేస్తుంది. ఇక అంజనా జీతం లక్షల్లో ఉంటుందని తెలుస్తుంది.
మహేష్ బాబు భార్య నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఇక మహేష్ సంపాదన గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలతో చేతినిండా సంపాదిస్తున్నాడు. ఆయన భార్య నమ్రత ఆయన వ్యాపారాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె కూడా బాగానే సంపాదిస్తున్నారు.రాంచరణ్ భార్య ఉపాసన

Ads

మెగాపవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన గురించి అందరికి తెలిసిందే. ఉపాసన భారీగానే సంపాదిస్తుంది. చరణ్ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుంది. ఉపాసన హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసింది.అంతేకాకుండా అపోలో హాస్పిటల్స్‌ పనులు చూసుకుంటుంది.
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి 10 కోట్ల పైనే తీసుకుంటాడు. ఆయన భార్య స్నేహ రెడ్డి స్పెక్‌ట్రం మ్యాగజైన్ కు ఛీఫ్ ఎడిటర్‌గా ఉంది. విదేశాలలో చదువుకున్న స్నేహ రెడ్డి ప్రస్తుతం జాబ్ చేస్తుంది. అలాగే తన తండ్రి ‘సెయింట్ ఇన్స్టిట్యూట్స్’ పనులను చూస్తుంది.
అల్లరి నరేష్ భార్య విరూప

కామెడీ సినిమాలతో అలరించే అల్లరి నరేష్ ఒక్కో మూవీకి కోటి దాకా పారితోషకం తీసుకుంటాడు.ఇక ఆయన భార్య విరూప ఈవెంట్ మేనేజర్‌గా లక్షల్లో సంపాదిస్తుంది.నందు భార్య గీత మాధురి

నటుడు నందు చిన్న చిత్రాల్లో హీరోగా చేస్తూ వస్తున్నాడు. ఇతని భార్య గీత మాధురి మంచి సింగర్ అని తెలిసిందే. గీత మాధురి భర్త కన్నా ఎక్కువే సంపాదిస్తుంది.రాజశేఖర్ భార్య జీవిత

హీరో రాజశేఖర్ భార్య జీవిత గురించి అందరికి తెలిసిందే. ఆమె కూడా భర్త సంపాదనకి సమానంగా సంపాదిస్తుంది. ప్రస్తుతం జీవిత సెన్సార్ బోర్డు మెంబర్.
Also Read: నిర్మాతలుగా మరి భారీగా నష్టపోయిన 10 మంది హీరోయిన్లు ఎవరో తెలుసా?

 

Previous articleఅనంత్ అంబానీ బరువు తగ్గడానికి ప్రతిరోజు ఇలాంటి ఆహారం తీసుకుంటారా..? డైట్ ఇంత కఠినంగా ఉంటుందా..?
Next articleపెళ్లిలో వధూవరులకు ఎందుకు ”బాసికం” ని కడతారు..? కారణం ఇదే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.