Ads
గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా మ్యాడ్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ కి జోడిగా కనిపించి అందరిని మెప్పించిన మలయాళీ హీరోయిన్ అవంతిక తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. మ్యాట్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన అవంతిక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో మ్యాడ్ 2 కూడా త్వరలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతుంది అవంతిక.
ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఇటు తెలుగులోనే కాదు అటు తమిళంలో కూడా రజనీకాంత్ తో లాల్ సలాం లో నటించి మెప్పించింది. తమిళంలో ఆమెకి ఇదే మొదటి సినిమా కావటం విశేషం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అవంతిక చాలా గ్లామరస్ గా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంది. క్యూట్ గా కనిపిస్తూనే అందాల ప్రదర్శనతో అలరించిన ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. అయితే ఈమె గురించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె వయసు. ఇప్పుడు ఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.
Ads
2006లో జన్మించిన ఈమె ప్రస్తుతం ప్లస్ టు చదువుతుంది. కరోనా సమయంలో విద్యా సంస్థలు మూతపడటంతో అందరూ సోషల్ మీడియాలో యాక్టివయ్యారు. అది కొంతమందికి వరంగా మారింది. చిన్న వయసులోనే సోషల్ మీడియాను షేక్ చేసేసింది అవంతిక. కరోనా టైంలో ఆమె వయసు 14-15 సంవత్సరాలు. మొదట్లో అవగాహన లేకపోవడం వలన ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వచ్చినా వాళ్ల పేరెంట్స్ రిజెక్ట్ చేసేవారంట.
కానీ తర్వాత 2022లో “రాజమండ్రి రోస్ మిల్క్” చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.. ఇది మలయాళ మూవీకి రీమేక్. మాడ్ లో కళ్ళజోడు కాలేజీ పాప చూడు సాంగులో అదిరిపోయే స్టెప్స్ వేసి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నిజానికి ఈమె మల్టీ టాలెంటెడ్ అని చెప్పవచ్చు. కరాటే లో బ్లాక్ బెల్ట్, కలరిపట్టులో ప్రావీణ్యత, కథాకళి, భరతనాట్యం, మోహిని అట్టం, కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలతో పాటు మోడరన్ డాన్స్ లో కూడా ఈమె ప్రవీణురాలు.
Ippudu +2 ahh vammo chudataniki asalu ala anipichatledhu kadra 🤯😭 pic.twitter.com/ONCV4wbPJm
— poorna_choudary (@poornachoudary1) February 20, 2024