Ads
కరోనా ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఎన్నో వేలమంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా కారణంగా అన్ని రంగాలు ఒక్కసారిగా కుదేలు అయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయ్యింది.
కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభం నుండి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అయితే ఇది ఒకవైపు మాత్రమే. మరో వైపు కరోనా మానసికంగా మనిషిని కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ వల్ల మనిషిలో ఒత్తిడి విపిరీతంగా పెరిగిందని చెబుతున్నారు. కరోనా వచ్చినా, రాకపోయినా కూడా మనిషులలో ఏర్పడిన భయం వల్లే గుండె పోటు లాంటి జబ్బులు వస్తున్నాయని గుర్తించామని చెబుతున్నారు.
Ads
మనిషి మానసిక స్థితి పై కోవిడ్ 19 సమయంలో పరిశోధకులు ఒక సర్వే చేశారు. అందులో భాగంగా సుమారు 136,000 మంది కరోనా సోకిన రోగులపై ఈ అధ్యయనం జరిపారు. ఆ పేషెంట్స్ నుండి తీసుకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా కోవిడ్ టైమ్ లో మనిషిలో యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి లక్షణాలు ఎక్కువగా పెరిగాయని తెలుసుకున్నారు. ఆ పేషెంట్స్ లో సగానికన్నా ఎక్కువ మంది డిప్రెషన్‌లో ఉన్నట్లు కనుగొన్నారు. ఇది గుండెకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులలు రావచ్చని అభిప్రాయ పడ్డారు. ఇక వీరిలో డిప్రెషన్,స్ట్రెస్, యాంగ్జయిటీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కోసం పేషంట్స్ ను పరీక్షించడం మరియు చికిత్స చేయడం అనేది చాలా ముఖ్యమని కనుగొన్నారు.
డిప్రెషన్ లక్షణాలు కరోనా పేషెంట్స్ లోనూ, సాధారణ ప్రజలలోనూ ఒకే విధంగా ఉన్నాయని ఈ అధ్యయనం నిర్ధారించింది. సుమారు 45 శాతం పేషంట్స్ లో కరోనా మొదట్లోనే కొంత డిప్రెషన్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అయితే 2021కి వచ్చేసరికి ఇది 55 శాతానికి పెరిగిందని, ఇక దీనిలో కోవిడ్ పాజిటివ్ అయినా కోవిడ్ నెగిటివ్ అయినా కూడా ఎక్కువగా తేడా లేదని తెలిపారు.ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి,అధిక స్థాయి కార్టిసాల్, అధిక రక్తపోటు, పీఎస్టీడీతో ముడిపడిపోయి ఉన్నాయి. దీని వల్ల ధమనులలో కాల్షియం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు భవిష్యత్తులో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నిపుణులు క్రమం తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు.Also Read: ఐరన్ లోపమా..? ఇలా ఈజీగా గుర్తించి.. ఈ ఆహారాన్ని తీసుకుంటే సరి..!