Ads
తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది కమెడియన్స్ లో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న నటులలో సునీల్ ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో సునీల్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.సునీల్ తన కామెడీ టైమింగ్ తో పంచుల మీదపంచులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
Ads
సినీ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ మూవీస్ లో నటించి చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆయన పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. అనంతరం తరుణ్ హీరోగా వచ్చిన నువ్వేకావాలి సినిమా ద్వారా కమెడియన్ గా తొలిసినిమాతోనే సునీల్ చాలా ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత మనసంతా నువ్వే, నువ్వు నేను సినిమాలతో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుదని వేణుతిరిగి చూసుకోలేదు. ఏడాదికి దాదాపు ఇరవై సినిమాల్లో నటిస్తూ ఆడియెన్స్ ని అలరించిన సునీల్ పర్సనల్ విషయాలు ఎక్కువ మందికి తెలియవు.
ఎందుకంటే సునీల్ తన ఫ్యామిలీని ఎప్పుడూ పరిశ్రమకి పరిచయం చేయకపోగా, ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఫోటోలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసకోలేదు. ఇక సునీల్ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయనకు 5ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి, అమ్మ సంరక్షణలోనే పెరిగి,పెద్దయ్యాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్,సునీల్ మంచి మిత్రులు అవడంతో, త్రివిక్రమ్ ప్రోత్సాహంతోనే టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాడు.
సునీల్ కి సినీ పరిశ్రమలోకి వచ్చిన కొన్ని రోజులకే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. ఇక సునీల్ సతీమణి పేరు శృతి. అయితే సునీల్ వివాహం జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా తన భార్య ఫోటోలను పంచుకోలేదు. సునీల్ శృతి దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు.
స్టార్ కమెడియన్ గా ఉన్న సునీల్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’ మూవీలో హీరోగా నటించారు. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలలో హీరోగా నటించినప్పటికీ, ప్రస్తుతం కమెడియన్ గా కూడా చేస్తున్నాడు.
Also Read:‘పుష్ప సీక్వెల్ తో పాటు వచ్చే ఏడాది రాబోతున్న మరిన్ని సీక్వెల్స్!