సిల్క్ స్మిత మరణానికి ముందు రాసిన చివరి ఉత్తరంలో ఏముందో తెలుసా?

Ads

సిల్క్ స్మిత, ఈ పేరు 1980, 90 ల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఆ కాలపు ప్రేక్షకుల్లో ఆమె తెలియనివారంటూ ఎవ్వరూ ఉండరు. సిల్క్ స్మిత ఒక సినిమాలో పాట చేస్తుంది అంటే చాలు. ఆ సినిమా పై ఎక్కడలేనంత క్రేజ్ ఏర్పడేదట.

Ads

ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో త‌న అంద‌చందాల‌తో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను ఒక ఊపు ఊపేసింది. ఆమె తన కెరీర్ తొలినాళ్ళలో సైడ్ డ్యాన్సర్ గా చేసింది. ఆ తరువాత రోజుల్లో సిల్క్ స్మిత అందం మరియు టాలెంట్ చూసి ఐట‌మ్ సాంగ్స్ లో అవ‌కాశాలు ఇచ్చారు. తనకు వచ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే అగ్ర స్థాయికి ఎదిగింది. ఎంతగా అంటే అప్పటి స్టార్ హీరోలు త‌మ చిత్రాలలో సిల్క్ స్మిత ఉండాలని డైరెక్టర్లకి చెప్పేవారంట. అంత స్టార్ డమ్ సంపాదించుకున్న సిల్క్ స్మిత కెరీర్ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఒక్కసారిగా డౌన్ అయ్యింది.అయితే స్కిల్క్ స్మిత కెరీర్ అలా అవ్వడానికి కారణం ఒక సీనియ‌ర్ హీరో అని అప్పట్లో ఆరోప‌ణ‌లు కూడా వచ్చాయి. కారణం ఏమైనా అవ‌కాశాలు తగ్గడంతో అప్పటిదాకా స్టార్ డమ్ ను చూసిన సిల్క్ స్మిత ఆ బాధతో డిప్రెష‌న్ లోకి వెళ్లింది. అయితే చివ‌రికి వరకు కూడా ఆమె ఆ డిప్రెష‌న్ నుండి బ‌య‌టికి రాలేక తన జీవితాన్ని తానే అంతం చేసుకుంది. అయితే సిల్క్ స్మిత దానికి ముందు ఒక ఉత్తరం రాసిపెట్టింది. అందులో ఏం రాసిందంటే..దేవుడా నా ఏడవ సంవత్స‌రం నుండి తిండి కోసం క‌ష్ట‌ప‌డ్డాను.అయితే న‌మ్మినవారే న‌న్ను మోసగించారు. నాకంటూ ఎవ‌రూ లేరు. ఒక్క బాబు త‌ప్ప మరెవరు నా మీద ప్రేమ చూపించలేదు. అందరు నా క‌ష్టం తిన్న‌వారే ఒక్క బాబు త‌ప్ప. నా తిండి తిన్న‌వారే నాకు నెమ్మది లేకుండా చేసారు. నేను అంద‌రికి మంచి చేసాను. కానీ నాకయితే చెడు జ‌రిగింది. నాకున్న ఆస్తిని బాబు ఫ్యామిలికి, నా ఫ్యామిలికి పంచాలి. ఇక నా ఆశ‌ల‌న్నీ ఒక్కరిపై పెట్టుకుంటే, చివరికి నన్ను అత‌డు మోసం చేశాడు.దేవుడంటూ ఉంటే వాడిని చూసుకుంటాడు. అతను నేను న‌గ‌లు కొనుక్కుంటే వాటిని పెట్టుకోనివ్వ‌లేదు. నాకు ఒక‌రు ఐదు ఏళ్ల క్రితం జీవితం ఇస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఇవ్వటం లేదు. నా రెక్క‌ల క‌ష్టం అందరు తిన్నారు బాబు త‌ప్ప‌. ఈ ఉత్తరంరాసేందుకు నేను ఎంత బాధను అనుభ‌వించానో చెప్ప‌లేను. అంటూ సిల్క్ స్మిత ఆవేద‌నతో రాసింది.

Also Read: ట్రోల్ అయిన తరువాత హిట్ అయినా దేవి శ్రీ 7 పాటలు ఏమిటో తెలుసా? 

Previous articleయాక్టర్ సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా?ఈ ఫోటోలపై ఓ లుక్ వేయండి..
Next articleయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సీరియల్ గురించి తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.