ఒక సినిమాలో లవర్ గా నటించి..ఇంకో సినిమాలో అదే హీరోకి చెల్లెళ్లుగా నటించిన 10 మంది హీరోయిన్లు వీరే.!

Ads

నటీనటులు వారు చేసే సినిమాలన్నిటిలో ఒకే రకమైన పాత్ర చేయలేరు. హీరో, హీరోయిన్లుగా ఒక సినిమాలో నటించిన వారు, మరో చిత్రంలో కూడా హీరో, హీరోయిన్లుగా నటిస్తారన్నది కూడా గ్యారెంటీ ఉండదు. ఇక ఇలాగే ఒక మూవీలో తల్లిదండ్రులుగా నటించిన యాక్టర్స్, ఇంకో మూవీలో అత్త మామలుగా కూడా నటిస్తారు.

Ads

చాలా సినిమాలలో అదే నటీనటులు ఉన్నప్పటికి వారు చేసే పాత్రలు మాత్రం మారుతాయి. ఈమధ్యకాలంలో విడుదలైన మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించిన చిరంజీవి, నయనతారలను చూసినప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ విషయం పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇలాగే గతంలో ఒక మూవీ జంటగా నటించిన నటీనటులు, ఇంకో మూవీ భార్యాభర్తలుగా చేసిన అలాంటి సినిమాలు ఉన్నాయా అని వెతుకుతున్నారు. ఇక ఒక మూవీలో భార్యాభర్తలుగా నటించి, మరో మూవీలో అన్నా చెల్లెళ్లుగా చేసిన ఆ జంటలు ఎవరో చూద్దాం రండి..
1.ఎన్టీఆర్-సావిత్రి:
ఎన్టీఆర్, సావిత్రి చాలా మూవీస్ లో హీరోహీరోయిన్స్ గా నటించారు. కానీ రక్త సంబంధం చిత్రంలో అన్నా చెల్లెళ్లుగా నటించారు.
2.చిరంజీవి-రమ్యకృష్ణ:
చిరంజీవి,రమ్యకృష్ణ కలిసి ‘చక్రవర్తి’ మూవీలో మెగాస్టార్ కి చెల్లలిగా నటించింది. ఆ తరువాత రమ్యకృష్ణ అల్లుడా మజాకా,ముగ్గురు మొనగాళ్లు వంటి చిత్రాలు చిరంజీవికి హీరోయిన్ గా చేసింది.
3.కృష్ణ-సౌందర్య:
కృష్ణ,సౌందర్యలు నెంబర్ వన్ మూవీతో పాటు చాలా మూవీస్ లో హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరూ ‘రవన్న’మూవీలో అన్నచెల్లెలుగా నటించారు.
4) రాజేంద్ర ప్రసాద్-రంభ:
ఆ ఒక్కటి అడక్కు మూవీలో రాజేంద్ర ప్రసాద్,రంభ హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ తరువాత ‘హిట్లర్’మూవీలో అన్నచెల్లెలుగా చేసారు.
5) రమ్యకృష్ణ-నాజర్ :
బాహుబలి సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించారు. వీరు ‘నరసింహ’ మూవీలో అన్నచెల్లెలుగా నటించారు.
6) ప్రకాష్ రాజ్-జయసుధ:
వీరు బొమ్మరిల్లు,మహర్షి, కొత్త బంగారు లోకం లాంటి సినిమాల్లో భార్యాభర్తలుగా నటించారు. ఇక ఇదే జంట‘సోలో’ మూవీలో అక్క తమ్ముడుగా నటించారు.
7) సురేష్-సౌందర్య:
వీరు అమ్మోరు మూవీలో భార్యాభర్తలుగా నటించారు. ‘దేవీపుత్రుడు’మూవీలో అన్న చెల్లెలుగా నటించారు.
8) చంద్రమోహన్-సుధ:
వీరు‘నువ్వు నాకు నచ్చావ్’మూవీలో అన్నాచెల్లెలుగా కనిపించారు.‘కృష్ణ’ మూవీలో భార్యాభర్తలుగా నటించారు.
9) జగపతి బాబు-వాణి విశ్వనాథ్:
జగపతి బాబు,వాణి విశ్వనాథ్ లు ‘సింహ స్వప్నం’ అనే మూవీలో జోడీగా నటించారు. ‘జయ జానకి నాయక’మూవీలో అన్నచెల్లెలుగా నటించారు.
10) చిరంజీవి-నయనతార:
చిరు నయన్ ‘సైరా’మూవీలో భార్యాభర్తలుగా నటించారు. తాజాగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో అన్నచెల్లెలుగా నటించారు.
Also Read: ఉదయ్ కిరణ్ ఈ 10 సినిమాలు చేసి ఉంటే నిలదొక్కుకునేవాడు!

Previous article20 ఏళ్ల సినిమా కెరీర్… 41 సినిమాలు..! కానీ ఒక్కటే హిట్..! ఈ హీరోయిన్ ఎవరంటే..?
Next article1955 నుండి ఇప్పటివరకు ఆ గ్రామంలో “రాఖీ” పండగ జరుపుకోలేదు అంట…ఎందుకో తెలుసా.?