20 ఏళ్ల సినిమా కెరీర్… 41 సినిమాలు..! కానీ ఒక్కటే హిట్..! ఈ హీరోయిన్ ఎవరంటే..?

Ads

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఎంత కష్టమో కెరియర్ లో ఎదగడం అంతకంటే కష్టం. మహమ్మద్ ఘోరీ…లాగా దండయాత్రలు చేస్తూ ఉన్నప్పటికీ.. కొందరికి ఒక్క సినిమాకి మించి సక్సెస్ అందదు. పాపం అదే కోవలోకి వస్తుంది బాలీవుడ్ నటి నేహా ధూపియా.

ఈ స్టార్ హీరోయిన్ తన 20 ఏళ్ల సినీ కెరియర్ లో 41 చిత్రాలకు పైగా నటించింది. అయితే ఇందులో సూపర్ డూపర్ హిట్ అందుకున్న చిత్రం ఒక్కటి మాత్రమే. ఇక రెండు యావరేజ్ సినిమాలు.. మిగిలినవన్నీ ఫ్లాపులే మరి.

actress who scored one hit in her career

బాలీవుడ్ లో ఎంత ప్రయత్నించినా నేహా తాను అనుకున్న స్టార్డం తెచ్చుకో లేకపోయింది. తనతో పాటు కెరియర్ మొదలుపెట్టిన అందరూ మంచి సక్సెస్ సాధిస్తే తాను మాత్రం కేవలం ఒకే ఒక హిట్టుతో నిలబడిపోయింది.2003లో ‘ఖయామత్’మూవీతో నేహా ధూపియా సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయింది. అజయ్ దేవగన్ మెయిన్ లీడ్ లో వచ్చిన చిత్రం లో ఆమెది పేరుకే హీరోయిన్ పాత్ర…మూవీ అంతా అజయ్ దేవగన్ ని హైలైట్ చేస్తుంది. పైగా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

Ads

actress who scored one hit in her career

రిజర్వుడ్ పాత్రలు చేస్తే లాభం లేదు అని ఫిక్స్ అయినా నేహా ఆ తర్వాత వచ్చిన ‘జూలీ’ మూవీ లో అందాలు ఆరబోసింది.. అయినా ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సెమి హిట్ అయింది. ఇక 2005 లో రితేష్ దేశ్‌ముఖ్, తుషార్ కపూర్, ఇషా కొప్పికర్‌లతో కలిసి ఆమె నటించిన ‘క్యా కూల్ హై హమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. అయితే ఇక తర్వాత మరి ఎటువంటి సక్సెస్ ఆమె ఖాతాలో పడలేదు. తెలుగులో రాజశేఖర్ తో కలిసి విలన్ మూవీలో నటించినప్పటికీ ఆమె సక్సెస్ కాలేకపోయింది. మొత్తానికి 41 సినిమాలు నటించి ఒక హిట్ తో నిలిచిన ఏకైక హీరోయిన్ గా నేహా ధూపియ రికార్డ్ సృష్టించింది.

ALSO READ : వామ్మో….గుప్పెడంత మనసు సీరియల్ జగతి.. ఇలా అయిపోయింది ఏంటి?

Previous article30 లేదా 31వ తేదీల్లో… ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలుసా?
Next articleఒక సినిమాలో లవర్ గా నటించి..ఇంకో సినిమాలో అదే హీరోకి చెల్లెళ్లుగా నటించిన 10 మంది హీరోయిన్లు వీరే.!