ఈ పథకాల్ని ప్రవేశ పెట్టిన ఘనత కాంగ్రెస్ కే సొంతం !

Ads

కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి రైతులు, పేదలకు అండగా నిలిచిన పార్టీ. రైతు రుణమాఫీ దేశ వ్యాప్తంగా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఉచిత విద్యుత్ తొలిగా అమల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. అసలు రైతన్న, నేతన్న, మహిళలు, దళితులు, బీసీలు ఎవరి గురించి అయినా ఆలోచన చేసేదీ, అభ్యున్నతికి పని చేసింది కాంగ్రెస్ పార్టీనే. అన్ని వర్గాల కోసం కాంగ్రెస్ అమలు చేసిన పథకాలనే కాపీ కొడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ చేయలేనది, తాను చేసింది ఏంటో చెప్పలేని నిస్సహాయత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మభ్య పెట్టే మాటలు, ప్రచార ఆర్భాటాలు మినహా కేసీఆర్ ఏం చేసారు?. కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది..చేసేదే చెబుతుంది.

TPCC pays homage to YSR on his death anniversary

కాంగ్రెస్ ఫిలాసఫీలోనే రైతు సంక్షేమం ఉంది. కాంగ్రెస్ విధానంలోనే పేదల అభ్యున్నతి కనిపిస్తుంది. కాంగ్రెస్ నినాదమే దళితుల అభివృద్ధి. రైతులకు ఉచిత కరెంట్ పైన నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటంతో ఎగిరెగిరి పడుతోంది. తెలంగాణలో ఎక్కడా రైతులకు  24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుతోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సవాళ్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. దుక్కి దున్నటానికి రైతలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్. రైతులకు సీలింగ్ యాక్ట్ కింద భూమిని పంచింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు అందని అంచనాలను తల కిందులు చేస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పైనే కాంగ్రెస్ సీఎంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేసారు.

YS Rajasekhara Reddy: A tough but value-based politician

Ads

రైతు సంక్షేమంలో కాంగ్రెస్ కు ఎవరూ పోటీ కాదు..సాటి రాలేరు. కాంగ్రెస్ అమలు చేసిన పథకాలనే తప్పని పరిస్థితుల్లో అమలు చేస్తూ తన గొప్పతనం గా ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నినాదమే గరీబీ హఠావో. దేశంలో పేదలకు భూములు పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ సొంతం. నాడు పంచిన భూములకు నేడు పట్టాలు ఇచ్చి అంతా మేమే చేసామని గొప్పలు చెప్పుకొనే దీన స్థితిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. మహిళలు, దళితులు, విద్యార్ధుల సంక్షేమానికి కాంగ్రెస్ తీసుకొచ్చిన స్కీంలే నేటికి అమలు అవుతున్నాయి. పేదలకు ఆరోగ్య శ్రీ తో కార్పోరేట్ వైద్యం అందించటం కాంగ్రెస్ విధానం. విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్ మెంట్ కాంగ్రెస్ కమిట్మెంట్. ఇవి కొనసాగించక తప్పని పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వానిది.

 

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీ అటకెక్కించారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానన్నారు. ఆ ఊసే లేదు. బీసీలకు కేసీఆర్ చేసింది ఏమీ లేదు. బీసీలను ఓట్ బ్యాంక్ గా వినియోగించుకోవటంలో ముందుండే కేసీఆర్ వారికి రాజకీయ ప్రాధాన్యత, ఎదిగేందుకు తోడ్పాటు ఇచ్చేందుకు మాత్రం మనసు ఒప్పటం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి దళితులు, బీసీలు కేసీఆర్ కు గుర్తుకు వచ్చారు. దళిత బంధు పేరుతో ఎన్నికల రాజకీయం ప్రారంభించారు. బీసీలకు రుణాల పేరుతో మీనమేషాలు లెక్కిస్తున్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నా.. రైతులకు చేస్తామని చెప్పిన రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదు. కేసీఆర్ చెప్పారంటే చేయరంతే. సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్. రైతుకు నాడు..నేడు ఏనాడైనా అండగా నిలిచేది కాంగ్రెస్.

Previous articleరేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహజ్వాలలు ! రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్ !
Next articleసినీరంగానికి చెందిన ఈ 13 మంది ప్రముఖులు బంధువులు అని తెలుసా?