Ads
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే ఆయన తన నటనతో ఆడియెన్స్ ని అలరించారు.
ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య చిత్రంతో లవర్ బాయ్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఆర్య సినిమా తరవాత అల్లు అర్జున్ తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఈ సినిమా ఆడియెన్స్ ని ఎంతగానో అలరించింది.
Ads
అల్లు అర్జున్ ఒక్క నటనతోనే మాత్రమే కాకుండా స్టైలిష్ లుక్ తోనూ చాలా మంది ఫ్యాన్స్ ను పొందారు. అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని బన్నీ యాక్టింగ్ కి బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఫిదా అయిపోయారు. పుష్ప మూవీకి ముందు బన్నీని స్టైలిష్ స్టార్ అనేవారు. అయితే ఈ మూవీ మొదలయినప్పటి నుండి డైరెక్టర్ సుకుమార్ బన్నీని ఐకాన్ స్టార్ అని పిలుస్తున్నారు. అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తరువాత అల్లు అర్జున్ని ఐకాన్ స్టార్ గా అందరు అంగీకరించారు.
ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ గంగోత్రి మూవీ కంటే ముందుగానే ఒక సినిమాలో నటించాడు. ఆయన బాలనటుడిగా కొన్ని సినిమాలలో నటించాడు. అయితే ఈ సంగతి ఆడియెన్స్ కి పెద్దగా తెలియదు. అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించాడు. అంటేకాకుండా లోక నాయకుడు కమల్ హాసన్, రాధిక నటించిన స్వాతి ముత్యం చిత్రంలో నటించి అలరించాడు. ఆయన లాగానే ప్రస్తుతం కుమార్తె అల్లు అర్హా సమంత నటించిన ‘శాకుంతలం’ మూవీతో బాలనటిగా పరిచయం అవుతున్న విషయం అందరికి తెలిసిందే.
Also Read: త్రివిక్రమ్ దర్శకుడిగా మారకముందు ఏం చేసేవారో తెలుసా..!