Ads
మనం సినిమా చూస్తున్నప్పుడు అప్పడప్పుడు సినిమా టైటల్స్ లోనే ఒక ప్రకటన కనిపిస్తుంది. ఈ సినిమాలో జంతువులకు హింసించలేదు అని, ఏదైనా జంతువులను ఆ సినిమాల్లో ఉపయోగించినట్లయితే ఆలాంటిది వేస్తారు.
కొన్ని మూవీస్ లో జంతువులు కూడా కీలక పాత్ర ఉంటుంది. మరి కొన్ని సినిమాల్లో అయితే హీరోకి ఉన్న ఇంపార్టెన్స్ వీటికి కూడా ఉంటుంది. ఇక సినిమాల్లో వివిధ జంతువులు ముఖ్య పాత్రలు పోషించిన సినిమాలు ఏమిటో చూద్దాం..1. రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్రప్రసాద్ నటించిన రాజేంద్రుడు-గజేంద్రుడు సినిమా 1993 లో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక ఏనుగు ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాలో ఏనుగు యజమాని మరణించాక రాజేంద్రప్రసాద్ దగ్గరికి వస్తుంది.ఈ సినిమా ఆడియెన్స్ ని బాగా అలరించింది.
2. మృగరాజు
మెగాస్టార్ చిరంజీవి సిమ్రాన్ హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా అడవిలో ఉంటున్న మనుషులను చంపే సింహం చుట్టూ తిరుగుతుంది.3. సాహసబాలుడు విచిత్ర కోతి
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన ఈ సినిమాలో బాలనటుడు నాగ అన్వేష్ తో పాటు చింపాంజీ కూడా ముఖ్య పాత్ర పోషించింది. 4. ఈగ
జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఈగదే. హీరో నాని మరణించిన తరువాత ఈగలాగా పుట్టి, విలన్లను చంపుతాడు.
Ads
5. లైఫ్ ఆఫ్ పై
ఈ సినిమా లై ఆఫ్ పై నవల ఆధారంగా తీసారు. ఈ సినిమాలో ఒక పులి, యువకుడు బోట్ లో సముద్రంలో చిక్కుకుపోతారు. వారి అనుభవాలే ఈసినిమా.6. చార్లీ777
కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమాలో ఒక కుక్కదే ముఖ్య పాత్ర. ఒంటరిగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి జీవితంలోకి చార్లీ అనే కుక్క వచ్చిన తరువాత ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నదే ఈ సినిమా.7. అదుగో
రవి బాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బంటి అనే పందిపిల్ల ముఖ్య పాత్ర పోషించింది. కొరియర్ ద్వారా తప్పిపోయిన పింది పిల్ల తనను వెతికే గ్యాంగ్ స్టర్ల నుండి ఎలా తప్పించుకుంటుంది అనేది సినిమా.
8. ఎంటర్టైన్మెంట్
అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమాలో కూడా ఒక కుక్క ముఖ్య పాత్ర పోషించింది. కుక్క ఓనర్ చనిపోతూ ఆస్తిని అంతా కుక్కకి రాస్తాడు. దీని చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది.9. ఆర్ ఆర్ ఆర్
రామ్ చరణ్,ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాలో పలు జంతువులు ముఖ్య పాత్ర పోషించాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాపని కాపాడేందుకు ఈ జంతువులను ఉపయోగించుకుంటాడు.10. హిట్ 2
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా రూపొందిన ఈ సినిమలో అడివి శేష్ ముఖ్య పాత్రలో నటించాడు. అతని వద్ద మాక్స్ అనే కుక్క ఉంటుంది.
Also Read: పూరి జగన్నాథ్ తొలి సినిమా ‘బద్రి’ గురించి ఆసక్తికర విషయాలు..