సుంద‌ర‌కాండ సినిమా హీరోయిన్ ”అప‌ర్ణ” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

Ads

విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రాల్లో బాగా గుర్తుండిపోయే మూవీ సుంద‌రకాండ‌. ఈ సినిమా ఒక విద్యార్ది టీచర్ ని ఇష్టపడితే ఎలా అనే నేపద్యంలో సాగుతుంది.

Ads

ఈ మూవీలో భార్యగా హీరోయిన్ మీనా నటించగా, వెంకటేష్ ను ఇష్టపడే విద్యార్ది కిరక్టర్ లో అపర్ణ నటించింది. అయితే ఈ మూవీ తరువాత ఎక్కువ మూవీస్ లో చేయలేదు.ఈమధ్యకాలంలో అపర్ణ ఫొటోలు నెట్టింట్లో షికారు చేస్తుండగా, వాటిని చూసినవారు షాక్ అవుతున్నారు. సుంద‌రకాండ‌ సినిమా 1992లో విడుదలైంది. ఈ మూవీకి కె.రాఘవేంద్రరావు గారు డైరెక్టర్. అదే ఏడాది భాగ్యరాజా డైరెక్షన్ లో సుందరకాండము అనే మూవీ తమిళంలో విడుదలై, అక్కడ సూపర్ హిట్ అయ్యింది. దాంతో కె.వి.వి.సత్యనారాయణ ఆ మూవీ రీమేక్ హక్కులు కొని ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ఈ సినిమాకి ముజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందించారు.ఇక ఈ సినిమా స్టోరీతో పాటు పాటలు,సంగీతం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంది. రాఘ‌వేంద్ర‌రావు ముందుగా అప‌ర్ణ పాత్ర కోసం ఒక పెద్ద హీరోయిన్ ను తీసుకోవాల‌ని చూశారు. కానీ ఆ క్యారెక్టర్ ఆ హీరోయిన్ కి సెట్ అవకపోవడంతో కొత్త అమ్మాయి అయితే బావుంటుంద‌ని, ఆ పాత్ర కోసం అమ్మాయిని వెతుకడం మొదలు పెట్టారంట.ఇక ఈ క్ర‌మంలోనే నిర్మాత కెవివి. స‌త్య‌నారాయ‌ణ గారింటికి కె.రాఘవేంద్రరావు వెళ్లారు. ఆ టైమ్ లో అక్క‌డే ఉన్న ఒక అమ్మాయిని చూసి, ఆ సినిమాలోని స్టూడెంట్ పాత్ర‌కు ఆమె అయితే బాగుంటుదని భావించారు. కానీ ఆమె నిర్మాత ఇంట్లో ఉండటంతో ఆ అమ్మాయి ఎవ‌రో, సినిమాల్లో చేస్తుందో లేదో అనుకుని మౌనంగా వెళ్లిపోయారంట.రాఘవేంద్ర‌రావు ఆ పాత్ర కోసం అడిష‌న్స్ పెడితే, అక్కడికి అప‌ర్ణ కూడా రావడంతో వెంట‌నే సెల‌క్ట్ చేసేశారు. ఆమెని వివరాలు అడిగితే, నిర్మాత కెవివి.స‌త్య‌నారాయ‌ణ మేన‌కోడ‌లు అనడంతో ఆమెకు ఓకే  చెప్పార‌ట. ఇక ఈ మూవీలో బాగా న‌టించి ప్రశంసలు పొందింది. ఆ త‌ర్వాత అపరణకు చాలా చిత్రాల్లో అవ‌కాశాలు వచ్చినా,పెద్దగా న‌టించ‌లేదు. అపర్ణ వివాహం చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఇటీవ‌ల ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో తిరుగుతుండగా చూసినవారు అపర్ణ ఇంతగా మారిపోయిందేమిటి అంటూ షాక్ అవుతున్నారు.

Also Read: తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే బెస్ట్ పెయిర్ అనిపించుకున్న 14 జంటలు ఎవరో తెలుసా?

Previous articleజంతువులు ముఖ్య పాత్ర పోషించిన 10 సినిమాలు ఇవే..!
Next articleపడుకుని లాప్టాప్స్ ని ఉపయోగిస్తే.. ఈ 5 సమస్యలు తప్పవు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.