Ads
సిని పరిశ్రమలో ఏ విధమైన బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చినవారు అనుకున్నది సాధించాలంటే చాలా కష్టమనే చెప్పాలి. కొంతమంది సినిమాల్లోకి హీరోలు అవుదామని వచ్చిన వారు దర్శకులుగా మరొచ్చు.
దర్శకులుగా వచ్చినవారు హీరోగాను సెటిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా హీరో ఛాన్స్ కోసం వచ్చిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్ లుగా మారుతుంటారు. ఇక అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చి, హీరోలుగా మారిన వాళ్లు ఎవరో చూద్దాం.
Ads
1. మాస్ మహరాజ రవితేజ
మాస్ హీరో రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టాడు. అయితే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ రావడంతో నటుడిగా మారాడు. మంచి గుర్తింపు రావడంతో హీరోగా ఛాన్స్ అందుకున్నాడు. మాస్ మహరాజ్ గా ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.2. నాని
న్యాచురల్ స్టార్ నాని కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే కెరీర్ ను మొదలుపెట్టాడు. అయితే అష్టాచెమ్మా సినిమాలో హీరోగా అవకాశం రావడం, ఆ మూవీ హిట్ కావడంతో వరుస సినిమాలు చేస్తున్నాడు.
3. సిద్ధార్థ్
లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ కూడా కెరీర్ ను అసిస్టెంట్ డైరెక్టర్ గానే మొదలుపెట్టాడు. ఆ తరువాత సిద్ధార్థ్ కు హీరోగా ఛాన్స్ రావడం, అవి హిట్ అవడంతో హీరోగా సెటిల్ అయ్యాడు. ఇటీవల మహాసముద్రం అనే మూవీతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు.4.రాజ్ తరుణ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, ఉయ్యాల జంపాల మూవీలో హీరోగా ఛాన్స్ రావడం,ఆ సినిమా హిట్ అవడంతో, ఆ తరువాత వరుస ఆఫర్స్ తో హీరోగా బిజీ అయ్యాడు.5. నిఖిల్
శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ మూవీతో పరిచమైన నిఖిల్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే స్టార్ట్ చేసాడు. నిఖిల్ ప్రస్తుతం హీరోగా బిజీగా మారాడు. నిఖిల్ విభిన్నపాత్రలు చేస్తూ,వరుస హిట్ లు ఇస్తూ ఆడియెన్స్ ని అలరిస్తున్నాడు.
Also Read: తెలుగులో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా?