తెలుగులో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా?

Ads

సినీపరిశ్రమలో హిట్ కొట్ట‌డం అంటే చిన్న విష‌యం అయితే కాదు. మ‌రి అలాంటిది ఇండ‌స్ట్రీ హిట్ అంటే సంచలనం అని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇండ‌స్ట్రీ హిట్ అనే మాట వాడాలి అంటే ఆ చిత్రం ఎంత పెద్ద హిట్ అవ్వాలంటే ఇండ‌స్ట్రీలో అప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన మూవీస్ రికార్డుల‌న్నిటిని బ్రేక్ చేయాలి.

అప్పుడే ఆ మూవీని ఇండ‌స్ట్రీ హిట్ అని పిలుస్తారు. అలాంటి ఇండ‌స్ట్రీ హిట్ లు కొంద‌రు హీరోలు ఎక్కువ కొట్టి టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇప్పుడు ఆ హీరోలు ఎవ‌రో చూద్దాం. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 40 ఇండ‌స్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ కొట్టిన హీరోలు చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు.

చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు:
ఇద్దరి కెరీర్ లో ఏడు ఇండ‌స్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఏఎన్ఆర్ కు బాల‌రాజు ఫస్ట్ ఇండ‌స్ట్రీ హిట్ ఆ త‌ర‌వాతీ కాలంలో ఆరు ఇండ‌స్ట్రీ హిట్ ల‌ను ఇచ్చాడు. చిరంజీవి ఫస్ట్ ప‌సివాడి ప్రాణం మూవీతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాడు. అనంతరం మ‌రో ఆరు ఇండ‌స్ట్రీ హిట్స్ లో న‌టించాడు. ఇంద్ర‌ మూవీతో చివ‌రిసారి ఇండ‌స్ట్రీ హిట్ ను కొట్టాడు.

Ads

ఎన్టీఆర్ తొలిసారి పాతాల‌భైర‌వి సినిమా ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. అనంతరం మ‌రో నాలుగు ఇండ‌స్ట్రీ హిట్ లు ఇచ్చాడు. ఎన్టీఆర్ లాస్ట్ ఇండ‌స్ట్రీ హిట్ పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్రస్వామి చ‌రిత్ర‌ మూవీ.బాలకృష్ణ ఖాతాలో మూడు ఇండస్ట్రీ హిట్ లు ఉన్నాయి. చివ‌ర‌గా బాలకృష్ణ న‌ర‌సింహ‌నాయుడు మూవీతో ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చాడు.ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, పవ‌న్ క‌ల్యాణ్, మ‌హేశ్ బాబు ల‌కు రెండు ఇండ‌స్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇక వెంక‌టేష్ నాగార్జున‌, మోహన్ బాబు ల ఖాతాలో ఒక ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చారు. అంతే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు త‌ర‌వాత‌ వరుస ఇండ‌స్ట్రీ హిట్స్ కొట్టిన హీరోగా ప్ర‌భాస్ ఉంటాడు.

Also Read: ఖుషి VS న‌ర‌సింహానాయుడు.. బాక్సాఫీసును షేక్ చేసిన సినిమా ఏది?

Previous articleటాప్ 8 తెలుగు సీరియ‌ల్ హీరోయిన్ల‌ రెమ్యున‌రేష‌న్స్.. ఎంతో తెలుసా?
Next articleపవన్ హీరోయిన్ ‘లవ్ లీ’.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.