2022లో పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీలు.. ఎవరో తెలుసా?

Ads

ఈ ఏడాది చాలా మంది సెలెబ్రెటీలు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక 2022లో సినీ పరిశ్రమకు చెందినవారు కూడా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

సెలబ్రిటీలు కొందరు తమ పెళ్లి పై ఎన్ని వార్తలు వచ్చినా స్పందించనివారు కూడా సడెన్‌గా వివాహం  చేసుకొని షాక్ ఇచ్చారు. కరోనా మహమ్మారి వల్ల చాలా మంది వారి వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇక ఈ సంవత్సరం ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో పలువురు సెలబ్రిటీలు ఓ ఇంటివారయ్యారు. ఈ సంవత్సరం తమ బ్యాచలర్ లైఫ్‌కు వీడ్కోలు చెప్పి, మనసుకు నచ్చినవారితో ఏడడుగుల వేసిన టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఎవరో చూద్దాం..మౌని రాయ్‌-సూరజ్‌ నంబియార్‌:
ప్రముఖ బాలీవుడ్ నటి మౌని రాయ్‌ కూడా దుబాయ్‌ బిజినెస్ మెన్ సూరజ్‌ నంబియార్‌ను పెళ్లి చేసుకుంది. జనవరి 27న గోవాలో వీరి వివాహం జరిగింది. మౌని రాయ్‌ మొదట్లో హిందీ సీరియళ్లలో నటించింది.ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌:
బాలీవుడ్‌ స్టార్‌ హీరోహీరోయిన్స్ ఆలియా భట్‌, హీరో రణ్‌బీర్‌ కపూర్‌లు ఈ ఏడాది ఏప్రిల్‌ 14న పెళ్లి చేసుకున్నారు. బ్రహ్మాస్ర్త షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ కలిగి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.ఇక ఆలియా ఈ ఏడాదే పాపకు జన్మనిచ్చింది.నయనతార-విష్నేష్‌:
దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా ఉన్న నయనతార కూడా ఇదే ఏడాది దర్శకుడు విష్నేష్‌ను జూన్‌ 10న పెళ్లి చేసుకుంది. వీరు 7 ఏళ్ల ప్రేమ తరువాత వివాహం చేసుకున్నారు. వీరు పెళ్ళయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు సరోగసీ పద్ధతిలో తల్లిదండ్రులుగా మారారు.పూర్ణ-ఆసిఫ్ అలీ ఖాన్:
నటి పూర్ణ ఆసిఫ్ అలీ ఖాన్ ను అక్టోబర్‌ 25న పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ వివాహం.

Ads

నాగశౌర్య-అనూష శెట్టి:
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అనూష శెట్టిని నవంబర్ 20న బెంగళూరులో ఘనంగా వివాహం చేసుకున్నారు.

హన్సిక-సోహైల్‌:
ఇటీవలే హీరోయిన్‌ హన్సిక కూడా పెళ్లిపీటలెక్కింది. డిసెంబర్‌ 4న ముంబై బిజినెస్ మెన్ సోహైల్‌ను హన్సిక వివాహం చేసుకుంది.

Also Read: కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చి విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

Previous articleప్రభాస్ ఛ‌త్ర‌ప‌తి సినిమాలో సూరీడు ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలుసా..?
Next articleఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ కానీ ఇప్పుడు హీరోలు.. 5 టాలెంటెడ్ హీరోలు వీరే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.