Ads
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అందరికీ ఒక మంచి రాజకీయ నాయకుడిగా, మంచి రాజకీయ చాణిక్యుడు గానే తెలుసు. కానీ అటల్ జి అలా ఎందుకు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు అనే విషయం చాలామందికి తెలియదు. వాజ్ పేయి పెళ్లయితే చేసుకోలేదు కానీ తనకి ఒక ప్రేమ కథ ఉంది అన్న విషయం మీకు ఎవరికైనా తెలుసా? ఆయన కాలేజీ చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడిన ప్రేమను వ్యక్తం చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందంటే…?
1942లో గ్వాలియర్ లోని విక్టోరియా కాలేజీలో వాజ్పేయి చదువుకున్నారు అదే కాలేజీలో తన క్లాస్మేట్ రాజకుమారిని తొలిచూపులోనే ఇష్టపడ్డారు. ఆమెను గాఢంగా ప్రేమించారు.అప్పట్లో ప్రేమికులు గంటల తరబడి మాట్లాడుకునే వారు కాదు. రాజకుమారిని దూరం నుండి చూసే సంబరపడేవారు రాజకుమారికి కూడా వాజ్పేయి అంటే చాలా ఇష్టం ఇద్దరు చూపులు కలిసాయి.
లైబ్రరీలో మాత్రమే ఇద్దరు మాట్లాడుకునేవారు కళ్ళతోనే ప్రేమించుకునేవారు అయితే ఒకరికి ఒకరు మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పుకోలేకపోయారు ఆ రోజుల్లో నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్లి ప్రేమను చెప్పడం అంటే కాస్త అజంకే వారు ఇక రాజ్ కుమారిని పెళ్లి చేసుకుందామని వాజ్ పేయి డిసైడ్ అయ్యారు.వాజ్ పేయి రాజకుమారికి ఒక ప్రేమకు లేఖ రాసి పుస్తకంలో ఉంచి అందించారు. ఆమె స్పందన కోసం ఎదురు చూశారు. రెండు మూడు రోజులైనా అటు నుండి ఎటువంటి స్పందన రాలేదు.అయితే ఆ లేఖను రాజకుమారి చదివారు. ఆమె సమాధానం కూడా రాసి అదే పుస్తకంలో పెట్టారు. అయితే ఆ పుస్తకం ఇచ్చే ఛాన్స్ ఆమెకు దొరకలేదు. అదే సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాలతో వాజ్ పేయి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది.
Ads
దీంతో ఆ లేఖ వాజ్ పేయి వరకు చేరలేదు. వాజ్ పేయిని పెళ్లి చేసుకుంటానని రాజకుమారి తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ వారు ఒప్పుకోలేదు. ఇద్దరు బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన వారైనా రాజకుమారి కుటుంబం శాఖా పరంగా, గోత్ర పరంగా ఉన్నతమైన కుటుంబం కావడంతో ఇంట్లో వారు ఒప్పుకోలేదు. వారి ప్రేమను ఆదిలోనే తుంచేశారు. ఇక తల్లిదండ్రులను ఎదిరించలేక రాజకుమారి వారు చూసిన సంబంధాన్నే చేసుకుంది. 1947లో బ్రజ్ నారాయణ కౌల్ అనే కాలేజీ లెక్చరర్ తో రాజకుమారి పెళ్లి చేశారు.ఆమె వివాహం జరిగిన తర్వాత వాజ్ పేయి కొన్ని రోజులు చాలా బాధపడ్డారు. ఇక అప్పటినుండి పెళ్లి చేసుకోకుండా పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉండేవారు.
ఒకానొక సందర్భంలో రాజకుమారిని వాజ్ పేయి ఢిల్లీలో కలిశారు. రాజకుమారి భర్త ఢిల్లీ వర్సిటీ పరిధిలోని రామాజా కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేసేవారు.అక్కడ భార్య భర్తలు ఇద్దరినీ వాజ్ పేయి కలిసేవారు. వారితో స్నేహం ఏర్పడడంతో వారి ఇంటికి రాకపోకలు కొనసాగిస్తూ ఉండేవారు.రాజకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు నమిత, నమ్రత. కొన్ని రోజులకు ప్రొఫెసర్ కౌల్ మరణించడంతో ఆ కుటుంబం వాజ్ పేయి నివాసానికి మకాం మార్చింది.
రాజకుమారి ఇక అప్పటినుండి వాజ్ పేయితో కొన్ని దశాబ్దాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ ఆయనతో కలిసి బయటి కనిపించలేదు. 2014 ఎన్నికల సమయంలో రాజకుమారి మరణించింది. ఆ సమయంలో ఆమెకు అద్వానీతో పాటు పలువురు బిజెపి నాయకులు వాజ్ పేయి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. రాజకుమారి కుమార్తె నమితను వాజ్ పేయి దత్తత తీసుకున్నారు.నమిత కుమార్తె నీహారిక అంటే వాజ్ పేయికి ప్రాణం.