ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి చాలా పాపులర్ హీరో అయ్యాడు… ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వస్తున్నాడు..! ఎవరో కనిపెట్టగలరా..?

Ads

సినిమాల్లోకి వచ్చాక చాలా మంది నటులు పాలిటిక్స్ లోకి వెళుతూ ఉంటారు. ముఖ్యమంత్రులు అయిన సినీ నటులు కూడా ఉన్నారు. గత కొంత కాలం నుండి సినిమా నటులు పాలిటిక్స్ లో పాల్గొనడం అనేది చాలా ఎక్కువగా జరుగుతోంది. సినిమాల ద్వారా ప్రజలకు చేరువ అయినవారు, రాజకీయాల్లో చేరి వారికి ఎంతైనా సహాయం చేయాలి అని అనుకుంటారు. వారి అభివృద్ధి కోసం కృషి చేయాలి అని అనుకుంటారు. అందుకే రాజకీయాల్లోకి వెళ్తారు. చెప్పినట్టుగానే ప్రజల కోసం కృషి చేస్తారు.

hero who is entering into politics

వారికి అభివృద్ధి చెందడానికి ఎన్నో మార్గాలని కల్పిస్తారు. ఈ పైన ఫోటోలో ఉన్న హీరో కూడా ఇప్పుడు స్టార్ హీరో అయ్యారు. దేశం మొత్తం ఈ హీరో గురించి తెలుసు. ఇప్పుడు పొలిటిక్స్ లో కూడా అడుగు పెడుతున్నారు. దళపతి విజయ్. ఈ వ్యక్తి గత కొంత కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఫేమస్ అయ్యారు. తుపాకీ సినిమా నుండి విజయ్ నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో తమిళ్ సినిమా రిలీజ్ అయినప్పుడే విడుదల అవుతున్నాయి. గత సంవత్సరం లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Ads

ఈ సినిమా కంటెంట్ పరంగా సాధారణంగా అనిపించినా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఘన విజయం సాధించింది. స్టార్ పవర్ అని ఈ సినిమాని అన్నారు. ఎందుకంటే విజయ్ కాకుండా ఇంకొక హీరో ఉంటే సినిమా ఇంత పెద్ద విజయం సాధించేది కాదు ఏమో. ఈ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రూపొందింది. ఈ సినిమాకి కూడా కొనసాగింపు ఉంటుంది. ప్రస్తుతం విజయ్ గోట్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమా తర్వాత విజయ్ ఒక సినిమా చేసి ఆ తర్వాత నుండి సినిమాల నుండి విరామం తీసుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ పాల్గొంటున్నారు. విజయ్ తన పార్టీని కూడా ప్రకటించారు. తమిళాగ వెట్రి కళగం అనే పార్టీతో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పటికే పార్టీ నుండి పనులు కూడా మొదలుపెట్టారు. ఎన్నో కొత్త పథకాలు తన పార్టీ ద్వారా అమలు చేయాలి అని విజయ్ ఆలోచనలో ఉన్నారు.

Previous articleఅటల్ బీహారీ వాజ్‌పేయి ప్రేయసి ఎవరో తెలుసా..? వీరి ప్రేమ కథ ఏంటంటే..?
Next articleరోజా సెల్వమణి “ప్రేమ కథ” తెలుసా..? వీరి పరిచయం ఎలా మొదలయ్యింది అంటే..?