Ads
సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా చేసిన సినిమా. రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేసిన తరువాత అల్లరి అల్లుడు, నాగా రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఎన్టీఆర్ కథలు వింటున్నపుడు సింహాద్రి ఆయన వద్దకు వచ్చింది.
Ads
అయితే సింహాద్రి స్క్రిప్ట్‌ని ఫస్ట్ నందమూరి బాలకృష్ణ కోసం చేశామని, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక సందర్భంలో తెలిపారు. అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు సినిమాలతో బాలకృష్ణకు బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన బి గోపాల్ సింహాద్రికి డైరెక్షన్ చేయాల్సింది. కానీ వయొలెంట్ మూవీస్ లో నటించి మాస్ హీరోగా పేరు వచ్చిన బాలకృష్ణకు ఈ స్టోరీ బాగా నచ్చిందని కానీ, నటించడానికి ముందుకు రాలేదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.ఆ తరువాత దర్శకుడు రాజమౌళికి స్టోరీ నచ్చడంతో ఆ సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో జూనియర్ ఎన్టీఆర్ కి స్టోరీ చెప్పాడు. ఇక స్టోరీ నచ్చడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ శనిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడు. మొదట హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ను అనుకున్నారు. కానీ ఆమె వసంతం మూవీతో బిజీగా ఉండడంతో హీరోయిన్ అంకితను తీసుకున్నారు. ఈ సినిమాలో భూమిక చావ్లా, అంకిత హీరోయిన్స్ గా నటించారు. ఇంకా ఇందులో నాజర్, ముఖేష్ రిషి, ముకుల్ దేవ్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమాకి ఎంఎం కీరవాణి అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌లు సాధించింది. ఈ సినిమాకి రాజమౌళి స్క్రీన్ ప్లే రాసాడు. అతని తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఎనిమిది కోట్ల బడ్జెట్ తో మొదలైన సినిమా. 150 ప్రింట్లతో 2003 జులై 9న విడుదలైన ‘సింహాద్రి’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రిలీజ్ కి ముందే 14 కోట్ల బిజినెస్ చేసుకున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీఆర్ నటన, ఇంటర్వెల్ ట్విస్ట్, ఫైట్స్, డాన్సులు, పాటలు, క్లైమాక్స్ తో మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
కలెక్షన్లు-రికార్డులు..
8 కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమా 25 కోట్లను వసూల్ చేసింది.
180 కేంద్రాలలో 50 రోజులు ఆడిన మూవీగా రికార్డ్
150 కేంద్రాలలో డైరెక్ట్ గా 100 రోజులు ఆడిన మూవీ.