Ads
గత 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో విభిన్న తరహా పాత్రలో నటించడమే కాకుండా…ఎప్పటికప్పుడు తన నటనతో ప్రేక్షకులను మైమరిపించే నటుడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఉన్న హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా చేయడమే కష్టమైపోతుంటే బాలయ్య మాత్రం ఈ వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నాడు. ఇప్పటికీ ఎప్పటికీ బాలయ్య కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి.
ఇదే క్రమంలో ఒకసారి బాలయ్య రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేసి…. రెండింటి నుంచి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఒకే రోజు ఒకే స్టార్ హీరో సినిమాలు రెండు రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డు సృష్టించడం అప్పట్లో పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసింది. మరి ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి..
Ads
బాలయ్య కెరియర్లో మైలురాయిలుగా నిలబడిన చిత్రాలు ఎన్నో అయితే వాటిల్లో నిప్పురవ్వ ,బంగారు బుల్లోడు రెండు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తెచ్చుకోవడమే కాకుండా బాలకృష్ణను నటుడిగా ఓ రేంజ్ లో నిలబెట్టాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అయ్యాయి అన్న విషయం మీకు తెలుసా? బాలయ్య విజయ్ శాంతి కాంబినేషన్ లో వచ్చిన నిప్పు రవ్వ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా వ్యవహరించారు. అప్పటివరకు హిట్ జోడిగా కొనసాగుతున్న విజయశాంతి ,బాలకృష్ణ చివరిసారి కలిసిన నటించిన చిత్రం ఇదే.
డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన బంగారు బుల్లోడు చిత్రం లో రమ్యకృష్ణ ,రవీనా టాండన్ ఇద్దరు హీరోయిన్స్ గా నటించారు. నిప్పురవ్వ ఆవరేజ్ టాక్ సంపాదించినప్పటికీ బంగారు బుల్లోడు చిత్రం మాత్రం అప్పట్లో మంచి రికార్డ్ సృష్టించింది. ఇలా అప్పట్లో ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసి బాలయ్య మంచి రికార్డ్ ను సృష్టించాడు. అప్పట్లో సోషల్ మీడియా అంతా రేంజ్ లో లేదు కాబట్టి ఆ విషయం ఎవరికీ తెలియలేదు. అదే ఇప్పట్లో అయితే ఈపాటికి ఇంటర్నెట్ మొత్తం వార్తతో హోరెత్తిపోయేది.