Ads
క్రికెట్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. క్రికెట్ కి అభిమానులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. క్రికెట్ ఆటకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అందరూ టీమిండియా జట్టును సపోర్ట్ చేస్తూ ఉండడం… టీం ఇండియా ఆడే మ్యాచ్లను చూడడం మనకు ఎంతో ఇష్టం. ఐపీఎల్ మ్యాచ్లు కూడా చాలా మందికి ఇష్టం. నిజానికి క్రికెట్ ఆట చాలా పాపులర్ అయింది. అయితే ఎప్పుడైనా మీరు ఇది గమనించారా..? క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్లు పిచ్ ని బ్యాట్ పెట్టి పరిశీలిస్తూ ఉంటారు.
ఎందుకు ఇలా పిచ్ ని బ్యాట్ తో పరిశీలిస్తారు..? దీని వెనుక కారణం ఏమిటి? ఇలా టెస్ట్ చేయడం వలన అసలు వాళ్లకి ఏం తెలుస్తుంది అనే వాటి కోసం ఇప్పుడు మనం చూద్దాం.
Ads
మ్యాచ్ ఆడేటప్పుడు పిచ్ మారుతూ ఉంటుంది ఈ విషయం గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు అయితే క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్లు పిచ్ ని బ్యాట్ పెట్టి చెక్ చేస్తే వాళ్లకి పక్కా అది ఉపయోగ పడుతుంది. ఇలా చెక్ చేయడాన్ని గార్డెనింగ్ అని అంటారు. ఉబ్బెత్తుగా ప్యాచ్‌లు వంటివి పిచ్ మీద ఉంటే బ్యాట్ తో వాటిని సెట్ చేసేయచ్చు. రఫ్ ప్యాచ్ లు వంటివి ఉన్నా కూడా సెట్ చేస్తూ వుంటారు.
అలానే క్రికెట్ ఆడే సమయం లో ఆటగాళ్ల పైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ని దూరం చేసుకోవడానికి కొందరు పిచ్ ని బ్యాట్ తో కొడుతూ వుంటారు. అంతే కాక బ్యాట్ తో ఇలా కొట్టడం వలన బౌలర్ రిథమ్ దెబ్బ తింటుందని.. వాళ్ళ రిథమ్‌ను దెబ్బ తీసేందుకే కొందరు ఇలా చేస్తూ ఉంటారట. గార్డెనింగ్ చేయడం వలన పిచ్ కండిషన్ కూడా తెలుస్తుంది. ఈ కారణాల వల్లనే ఆటగాళ్లు బ్యాట్ తో పిచ్ ని కొడుతూ వుంటారు. ఊరికే ఏమి కాదు.