ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు బౌద్ధ సన్యాసి..! ఎవరంటే..?

Ads

దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు సినిమాలలో నటిస్తూ స్టార్ స్టేటస్ ను అందుకుని, అగ్రస్థానంలో నిలిచి, సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కొందరు అవసాన దశలో అంతా కోల్పోయి, దీనస్థితికి వచ్చారు.

Ads

కొందరు హీరోయిన్లు మాత్రం కొంత కాలం పాటు గుర్తింపు తెచ్చుకుని, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు. మరికొందరు కొంతకాలం నటించి, పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం కాగా, మరికొందరు గ్లామర్ ప్రపంచాన్ని విడిచిపెట్టిన సడన్ గా ఆధ్యాత్మికత వైపుకు వెళ్తున్నారు. అలా బౌద్ధ సన్యాసిగా మారిన బాలీవుడ్ హీరోయిన్ ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
పైన ఫొటోలో బౌద్ధ సన్యాసి పేరు గ్యాల్టెన్ సామ్టెన్. ఆమె ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, మోడల్, నిర్మాత. ఆమె అసలు పేరు బర్ఖా మదన్. పంజాబ్‌లో జన్మించిన బర్ఖా, మొదట మోడలింగ్ లో కెరీర్ ప్రారంభించింది. 1974లో, ఫెమినా మిస్ ఇండియా పోటీలో సుస్మితా సేన్ మరియు ఐశ్వర్య రాయ్‌లతో పోటీ పడింది. అదే సంవత్సరంలో ఆమె మిస్ టూరిజం ఇండియా బిరుదును అందుకుంది. ఆమె 1996లో ‘ఖిలాడియోన్ కా ఖిలాడి’ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అందులో అక్షయ్ కుమార్,  రేఖతో స్క్రీన్ షేర్ చేసుకుంది.
ఆమె నటనకు అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ, బర్ఖా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంది. ఇండో-డచ్ మూవీ ‘డ్రైవింగ్ మిస్ పామెన్‌’ తో విదేశీ చిత్రాలలో నటించడం మొదలుపెట్టింది. 2003 లో రామ్ గోపాల్ వర్మ హర్రర్ చిత్రం భూత్ లో నటించింది. ఈ మూవీ హిట్ కావడంతో పాటు  దెయ్యం పాత్రలో బర్ఖా నటనకు ప్రశంసలు కురిసాయి. ఆతరువాత ఆమె గోల్డెన్ గేట్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించింది. ఆమె లీడ్ రోల్ లో ‘సోచ్ లో మరియు సుర్ఖాబ్’ అనే రెండు సినిమాలను నిర్మించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. బర్ఖా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి పేరు తెచ్చుకుంది.
ఆమె 2012లో బౌద్ధ సన్యాసినిగా మారాలనుకుంది. రెండు మూడేళ్ల అనంతరం దలైలామా అనుచరురాలు లామా జోపా రిన్‌పోచే పర్యవేక్షణలో సన్యాసం స్వీకరించింది. ఆ తరువాత ఆమె పేరుని ‘గ్యాల్టెన్ సామ్టెన్’ గా  మార్చుకుంది. ప్రస్తుతం ఆమె ఆశ్రమ జీవితం గడుపుతోంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఆధ్యాత్మికతకు సంబంధించిన పోస్ట్ లే షేర్ చేస్తున్నారు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు చూసినవారు,  ఆమె లేటస్ట్ లుక్ చూసి షాక్ అవుతున్నారు.

Also Read: “భద్ర” మూవీలో ఈ 2 సీన్లు గమనించారా..? భలే మోసం చేసారుగా పాపం.!

Previous articleఎన్టీఆర్ భార్య బసవతారకం, చిరంజీవి భార్య సురేఖలో ఉన్న పోలిక ఏమిటో తెలుసా?
Next articleఈ ఫోటోలో తన తండ్రితో ఉన్న అబ్బాయి ఇప్పుడు ఇండియాలోనే టాప్ స్టార్ అయ్యాడు..! ఎవరో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.