Ads
డైరెక్టర్ ని ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అని అంటారు. ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి దర్శకులు ఎంతో కష్టపడతారు. దర్శకత్వం అనేది సులభమైన విషయం కాదు. నటీనటుల దగ్గర నుండి ఆ సినిమాకి పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత దర్శకుడి పైనే ఉంటుంది.
సినిమా విజయం సాధిస్తే ఆ దర్శకుడి పేరు మారుమ్రోగుతుంది. ఒకవేళ ఆ మూవీ ఫ్లాప్ అయితే సినిమాలోని చిన్న చిన్న విషయాలను, మిస్టేక్స్ ను కూడా వెలికితీసి ఆ దర్శకుడిని విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. ఇలా చేయడం ప్రస్తుతం చాలా కామన్ అయ్యింది.
ఆ కారణం వల్లే ఒక చిత్రాన్ని తెరకెక్కించేటపుడు దర్శకుడికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆలాంటి టైమ్ లో కొందరు దర్శకులు చిన్నపాటి లాజిక్స్ కూడా మిస్ అవుతారు. అందుకు ఉదాహరణగా రవితేజ నటించిన భద్ర మూవీలోని రెండు సీన్స్. అయితే ఇది కేవలం తెరపై కనిపించె సన్నివేశాల ఆధారంగా మాత్రమే చెప్పేవి.
ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో ప్రకాష్ రాజ్ వద్దకు ఆ ఊరికి చెందిన కొందరు యువకులు వచ్చి, విలన్ ని హతమరుస్తామని చెబుతారు. అప్పుడు వాళ్ళతో ప్రకాష్ రాజ్ గొడవల్లోకి వెళ్లొద్దని, జాతర చూడడానికి వచ్చారు. అది జాతర చూసి వెళ్ళమని చెప్తారు. ఆ యువకులు ప్రకాష్ రాజ్ కి ఏదైనా జరిగితే ఊరుకోమని చెప్పి వెళ్తారు. ఆ తర్వాత జాతరలో జరిగిన ఫైట్ సీన్ లో ఆ యువకులలో ఒక్కరు కనిపించరు.
ప్రకాష్ రాజ్ కి ఏదైనా జరిగితే విలన్ ని విడిచిపెట్టము అని అంటారు. జాతర ఫైట్ తరువాత విలన్ బతికేఉంటాడు. ఇలాంటి విషయాలను పూర్తిగా తప్పు అని లేదా ఒప్పు అని కానీ చెప్పలేం. ప్రతి సన్నివేశం వెనక ఓ బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. ఈ సీన్స్ చూసినవారికి మిస్టేక్ అనిపించేది. మూవీలో కరెక్ట్ కావచ్చు. అందువల్లే ఇలాంటివాటిని లాజిక్ అనుకోవడమే. ఇక ఈ చిత్ర దర్శకుడి గురించి తెలిసిన ప్రేక్షకులు అలాంటివాటిని పటించుకోరని చెప్పవచ్చు.
Ads
Also Read: బాలకృష్ణ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటారు అంటే..?