మీ బోన్ హెల్త్ నెగ్లక్ట్ చేస్తున్నారా…. అయితే జాగ్రత్త…

Ads

మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎముకల బలం ఎంతో అవసరం. మన ఎముకలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో అప్పుడే మనం ఎటువంటి పని అయినా సులభంగా చేసుకోగలుగుతాం. మన శరీర బరువుని మొత్తం మోయాల్సింది మన ఎముకలు.. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మనకు ఎంతో ముఖ్యం. ఇది మన శరీరానికి ఫ్రేమ్‌వర్క్‌ లాంటివి…అందుకే అవి ఎంత బలంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము.

అయితే నేటి హడావిడి జీవనశైలి మరియు అనారోగ్యపు ఆహారపు అలవాట్ల వల్ల మనం మన బొన్ హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. చాలామంది ప్రస్తుతం ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా ఎముకలపై ఒత్తిడి పెరిగి ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఎముకలు బలంగా లేకపోతే కీళ్ల నొప్పులు ,ఎముకలు బెనకడం లాంటి సమస్యలు సర్వ సాధారణం అవుతాయి.

Ads

మీ బోనే హెల్త్ కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. సమతుల్యమైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పాలు ,చేపలు ,బాదంపప్పు, పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం శాతాన్ని మెండుగా అందిస్తాయి.

విటమిన్ డి, కె ఎముకలకు వ్యాధులు రాకుండా కాపాడడంలో సహాయపడతాయి. మీ ఎముకలు ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారంతో తీసుకోవడమే కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం మరియు మద్యపానం లాంటి అలవాట్లు ఎముకలను బలహీనపరిచి దెబ్బతీస్తాయి.

Previous articleరిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ కాకపోతే స్టార్ హీరోల చిత్రాలైన డిజాస్టర్ కావాల్సిందే…
Next articleజీవితంలో విజయం సాధించాలి అనుకున్నవారికి చాణిక్యుడు చెప్పిన నీతులు..