రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ కాకపోతే స్టార్ హీరోల చిత్రాలైన డిజాస్టర్ కావాల్సిందే…

Ads

పెద్ద స్టార్ లో నటించిన సినిమాలు అంటే నిర్మాతలు,బయర్స్ సేఫ్ జోన్ లో ఉంటారు అని అందరూ భావిస్తారు. కానీ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఎటువంటి బజ్ లేకుండా సినిమా విడుదల చేస్తే 70 శాతం వరకే బిజినెస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పట్టి ఎంత పెద్ద సినిమా అయినా సరియైన పబ్లిసిటీ లేకుండా జనాల్లోకి వెళ్లడం కష్టం అని చెప్పాలి. టాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఎటువంటి బజ్ లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరికొన్ని సినిమాలు పర్వాలేదు అన్న టాక్ తెచ్చుకుని ఏదో కాస్త హిట్స్ గా నిలిచాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి చూద్దామా…

1.రభస :

2014 ఆగస్టులో ఎన్టీఆర్ హీరోగా విడుదలైన రభస ఎటువంటి హడావిడి లేకుండా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వీకెండ్ లోని ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడిపోయింద

2) బ్రహ్మోత్సవం :

2016 మే లో ఏటువంటి హడావిడి లేకుండా విడుదలైన మహేష్ బాబు బ్రహ్మోత్సవం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.

3) ధృవ :

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోలీస్ క్యారెక్టర్ లో నటించిన ధ్రువ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద ఆవరేజ్ గా నిలిచింది. సరిగ్గా అదే టైంకి 500, 1000 నోట్లు రద్దు కావడం సినిమాకు మైనస్ అయింది లేకపోతే కచ్చితంగా ఈ మూవీ హిట్ అయ్యేది.

4) కాటమరాయుడు :

సైలెంట్ గా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడు రీమిక్స్ చిత్రం కావడం మరియు ఆల్రెడీ డబ్ అయిన తెలుగు వర్షన్ చాలా సార్లు టీవీలో ప్రసారం కావడంతో ఫ్లాప్ టాప్ తెచ్చుకుంది.

5) స్పైడర్ :

మహేష్ బాబు మరియు తమిళ్ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం స్పైడర్. తెలుగు నేటివిటీకి కంప్లీట్ గా దూరంగా ఉండటంతో ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

6) ఆఫీసర్ :


నాగార్జున మరియు ఆర్జీవి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఎటువంటి హైట్ లేకపోవడంతో పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

7) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా :

అల్లు అర్జున్ మిలిటరీ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం విడుదలకు ముందు మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదు. మొదటి షో తోటే ఈ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోండి   

Previous articleఆ విషయంలో మెగాస్టార్ కూడా మహేష్ బాబుని ఫాలో అయితే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదే కాదు….
Next articleమీ బోన్ హెల్త్ నెగ్లక్ట్ చేస్తున్నారా…. అయితే జాగ్రత్త…