బ్రహ్మానందం ప్రేమ ఎలా మొదలయ్యిందో తెలుసా..? తల్లిదండ్రులని ఎలా ఒప్పించారంటే..?

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి బ్రహ్మానందం గారు. అయితే బ్రహ్మానందం గారు సినిమాల్లో ఎంత ఫేమస్ అయినా కూడా వ్యక్తిగత జీవితం గురించి అంత పెద్దగా తెలియదు. బ్రహ్మానందం కొడుకు గౌతమ్ సినిమాల్లో చేశారు. ఇటీవల వచ్చిన దూత సిరీస్ లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. అయితే, బ్రహ్మానందం గారికి కూడా ఒక ప్రేమ కథ ఉంది. బ్రహ్మానందం గారిది ప్రేమ వివాహం అనే విషయం చాలా మందికి తెలియదు.

brahmanandam love and marriage story

ఈ విషయాన్ని బ్రహ్మానందం, “నేను-మీ బ్రహ్మానందం” పేరుతో రాసిన ఆటోబయోగ్రఫీ పుస్తకంలో పంచుకున్నారు. బ్రహ్మానందం గారు ఎన్నో కష్టాలు దాటుకొని కాలేజ్ లెక్చరర్ గా జాబ్ సంపాదించుకున్నారు. అత్తిలిలో బ్రహ్మానందం గారు లెక్చరర్ గా పనిచేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. బ్రహ్మానందం గారిది చిన్నప్పటినుండి పేద కుటుంబం అవ్వడంతో వచ్చే అమ్మాయి కట్నం తేవాలి అని చెప్పి బ్రహ్మానందం తల్లిదండ్రులు అనుకున్నారు.

Ads

బ్రహ్మానందం గారికి చదువుకి డబ్బుల విషయంలో అనసూయమ్మ గారు అనే ఒక వ్యక్తి సహాయం చేశారు. ఆవిడ బ్రహ్మానందానికి ఒక సంబంధం తీసుకొచ్చారు. ఆవిడ భర్త చెల్లెళ్లలో ఒకరైన లక్ష్మీ అనే అమ్మాయిని బ్రహ్మానందం గారు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి సలహా ఇచ్చారు. బ్రహ్మానందంకి, లక్ష్మీకి ముందే పరిచయం ఉంది. అంటే పెద్దగా మాట్లాడుకోకపోయినా కూడా ముఖాలు తెలుసు. అనసూయమ్మ గారు బ్రహ్మానందం గారికి సహాయం చేశారు.

అంతే కాకుండా లక్ష్మీ కూడా చాలా మంచి అమ్మాయి అని తెలియడంతో బ్రహ్మానందం గారు ఆవిడని పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పారు. కానీ బ్రహ్మానందం గారి ఇంట్లో వాళ్ళు ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. అందుకు కారణం ఇద్దరి కులాలు వేరు కావడం. బ్రహ్మానందం గారు విశ్వబ్రాహ్మణులు అయితే, లక్ష్మీ గారు కాపులు. అందులోనూ బ్రహ్మానందం గారు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అనడంతో ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోలేదు.

అయితే లక్ష్మీ గారితో పెళ్లి జరగాకపోతే తాను జీవితంలో పెళ్లి చేసుకోను అని బ్రహ్మానందం గారు చెప్పడంతో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అలా పెద్దల అనుమతితో డిసెంబర్ 14 వ తేదీ, 1977 లో బ్రహ్మానందం గారు, లక్ష్మీ గారు పెళ్లి చేసుకున్నారు. అప్పుడున్న జీతంతో ఇద్దరు బతకడం కష్టం అని, లక్ష్మీ గారి సహకారంతోనే తాను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాను అని చెప్పి బ్రహ్మానందం గారు తన పుస్తకంలో పేర్కొన్నారు.

Previous articleహీరోయిన్ సమంత టెన్త్ క్లాస్ మార్కులను చూశారా..?
Next articleఅప్పటి సీరియల్ నటుడు… ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ అయ్యాడు..! ఎవరో గుర్తుపట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.