హీరోయిన్ సమంత టెన్త్ క్లాస్ మార్కులను చూశారా..?

Ads

హీరోయిన్ సమంతను అందమైన హీరోయిన్ గా మాత్రమే కాకుండా తెలివైన హీరోయిన్ అని అందరు అనుకుంటారు. ఇక సమంత కెరీర్ లో ఆమె నటించిన చిత్రాలలో ఎక్కువ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఆమె కథలను సెలెక్ట్ చేసుకోవడంలోనూ, క్యారెక్టర్ ఎంచుకోవడంలోనూ ఆమెకు ఆమెనే సాటి అని సమంత ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నెటిజన్లు కూడా భావిస్తారు. సాధారణంగా సిని పరిశ్రమలో ఉన్నవారు ఎక్కువగా చదవరని ఎప్పటి నుండో ఇండస్ట్రీలో టాక్ ఉంది. హీరోయిన్ సమంత 10వ తరగతిలో టాపర్ అవడం విశేషం. ప్రస్తుతం ఆ మార్కుల లిస్ట్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది.
చెన్నైలో సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో పదో తరగతి చదువుకున్నారు. అయితే అప్పుడు జరిగిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో 1000 మార్కులకు సమంత 887 మార్కులు తెచ్చుకుంది. ఇక మ్యాథ్స్ లో అయితే ఆమెకు వందకి వంద మార్కులు వచ్చాయి. స్కూల్ టీచర్లు సమంతను ప్రశంసిస్తూ ఆమె ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ లో ఆమె గురించి రాశారు. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయపడే సమంత ఫ్యాన్స్ సమంత గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ఆమె ఇండస్ట్రీకి రాకుండా ఉంటే సమంత మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉంటుంది. మనస్సులో అనుకున్న విషయాలను సూటిగా వెల్లడించే హీరోయిన్లలో సమంత ముందువరసలో ఉంటారని చెప్పవచ్చు. ఇప్పటికే పలుసార్లు సమంత అలాంటి కామెంట్లు చేయగా అవి వైరల్ కూడా అయ్యాయి. సమంత క్రేజ్ సినిమా సినిమాకు పెరుగుతూ వస్తోంది. అయితే యశోద సినిమా సమయంలో మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌ తో బాధపడుతున్నట్లు తెలిపింది. చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకుని ఈ మధ్యే కొలుకుంది.

Ads

శాకుంతలం ఈవెంట్ లో పాల్గొంది. ఈ సినిమా గత సంవత్సరం విడుదల అయ్యింది. అలాగే హీరో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అంతేకాకుండా ప్రస్తుతం ఆమె చేతిలో అనేక ప్రాజెక్ట్ లు ఉన్నాయి. సమంత రాబోయే సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సమంత నాగ చైతన్యతో విడాకులు అయినప్పటి నుండి ఆమె తల్లితోనే కలిసి ఉంటున్నారు.

Also Read: తెలుగు ఇండస్ట్రీ లో విడాకులు తీసుకున్న సెలెబ్రెటీలు వీరే..!

Previous articleలోక్‌సభ ఎన్నికల్లో బర్రెలక్కకి ఎన్ని ఓట్లు వచ్చాయి..? అక్కడ ఎవరు గెలిచారంటే..?
Next articleబ్రహ్మానందం ప్రేమ ఎలా మొదలయ్యిందో తెలుసా..? తల్లిదండ్రులని ఎలా ఒప్పించారంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.