అప్పటి సీరియల్ నటుడు… ఇప్పుడు సెన్సేషనల్ స్టార్ అయ్యాడు..! ఎవరో గుర్తుపట్టారా..?

Ads

కొంతకాలంగా సోష‌ల్ మీడియాలో త్రో బ్యాక్ ట్రెండ్  కొన‌సాగుతుంది. ఈ క్రమంలో సినీ సెల‌బ్రెటీల  చిన్న నాటి ఫోటోలు లేదా కెరీర్ మొదట్లోని ఫోటోలు అభిమానులు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సౌత్, నార్త్‌ అనే  తేడా లేకుండా ఇండ‌స్ట్రీ సెల‌బ్రిటీల పోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. వాటిలో కొంద‌రిని  పాత ఫోటోల‌తో పోల్చినపుడు వారేనా కాదా అనేల ఉన్నాయి. తాజగా పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్న హీరో గతంలో సీరియల్స్ లో నటించారు. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..

this serial actor became a star hero

పైన  ఫోటోలో ఉన్న యాక్టర్ ను వెంటనే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్టంగా ఉన్నా, ఆ హీరోకి పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ హీరో నెక్స్ట్ సినిమా ఏమిటా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఆ కన్నడ స్టార్ హీరో  మొదట్లో బుల్లితెర పై పలు  సీరియల్స్ లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన యష్ యాక్టర్ నుండి ‘రాకింగ్ స్టార్’ గా ఎదిగారు.

Ads

యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. 1986లో కర్ణాటకలోని హసన్ జిల్లాలోని భువనహళ్లిలో  జె అరుణ్ కుమార్,  పుష్ప దంపతులకు జనవరి 8న జన్మించాడు. యష్ తండ్రి బస్సు డ్రైవర్. యష్ కు చిన్నప్పటి నుండి నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే టివి ఇండస్ట్రీలో ఉత్తరాయణ అనే సీరియల్‌తో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఈటీవీ కన్నడలో ప్రసారమైన  సీరియల్ సిల్లీ లల్లీ, నంద గోకుల్ వంటి పలు సీరియల్స్ లో నటించాడు. నందగోకుల్ సీరియల్ లో నటించిన రాధిక పండిట్‌ని ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాలలో కలిసి నటించారు.

2007లో ‘జంబద హుడుగి’ మూవీతో యష్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రెండవ సినిమా మొగ్గిన మనసులో చేసిన  పాత్రకు గుర్తింపు వచ్చింది. ఆ మూవీకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. 2008 లో రాకీ మూవీలో  హీరోగా నటించి, ఆకట్టుకున్నాడు. వరుస చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎదుగారు. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా మారారు.

Previous articleబ్రహ్మానందం ప్రేమ ఎలా మొదలయ్యిందో తెలుసా..? తల్లిదండ్రులని ఎలా ఒప్పించారంటే..?
Next article“మై నేమ్ ఈజ్ మంగతాయారు” హీరో కృష్ణ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా..? ఏం చేస్తున్నారంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.