పవన్ కళ్యాణ్ “బ్రో” సెన్సార్ టాక్..! సినిమా గురించి ఏం అన్నారంటే..?

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా కూడా మరి కొద్ది రోజుల్లో విడుదల అవుతుంది.

ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాము అని సినిమా బృందం ప్రకటించారు. సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు పాటలు విడుదల అయ్యాయి. అందులో ఒక పాటకి యావరేజ్ రెస్పాన్స్ వస్తే, మరొక పాటకి మాత్రం అంత మంచి రెస్పాన్స్ రాలేదు.

ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ మాట్లాడి, ఆ పాటలో డాన్స్ తనకే నచ్చలేదు అని, కొంత సమయం తీసుకుని మళ్ళీ వీటన్నిటిపై శ్రద్ధ పెట్టి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పారు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాకి సెన్సార్ బృందం యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇంక సినిమా టాక్ విషయానికి వస్తే, ఒరిజినల్ లో లాగానే ఇందులో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అనే వార్త వినిపిస్తోంది.

Ads

అవి కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతాయి అని అంటున్నారు. అంతే కాకుండా తెలుగు నేటివిటికి తగ్గట్టు త్రివిక్రమ్ చేసిన మార్పులు, ఇలాంటి సీన్స్ లో త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.

bro movie censor talk

ఇంక ఈ సినిమా విషయానికి వస్తే, బ్రో సినిమా తమిళ్ లో సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన వినోదయ సిత్తం సినిమాకి రీమేక్ గా రూపొందింది. అందులో సముద్రఖని పోషించిన దేవుడి పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారు. అందులో మరొక ముఖ్య పాత్ర ఆయన తంబి రామయ్య పాత్రని మార్చి తెలుగులో సాయి ధరమ్ తేజ్ పాత్ర వచ్చే లాగా మార్పులు చేశారు.

bro movie censor talk

తమిళ్ లో ఒక మధ్య వయస్కుడికి సంబంధించిన కథని, తెలుగులో ఒక యువకుడికి సంబంధించిన కథగా మార్చారు అని అది చూస్తుంటేనే అర్థం అవుతోంది. ఈ సినిమా గురించి డైరెక్టర్ సముద్రఖని మాట్లాడుతూ, కేవలం ఎమోషన్స్ మాత్రమే సేమ్ అని, అసలు ఒరిజినల్ తో మిగిలిన విషయాల్లో బ్రో సినిమాకి పోలిక ఉండదు అని అన్నారు.

ALSO READ : “అన్నపూర్ణ ఫోటో స్టూడియో ” మూవీ స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Previous articleరియల్ స్టార్ శ్రీహరి గురించి సంచలన నిజాలని చెప్పిన భార్య డిస్కో శాంతి !
Next articleమీ అరచేతి మీద ఇలాంటి గుర్తు ఉందా..? దాని అర్థం ఏంటో తెలుసా..?