Ads
శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు అని భావిస్తారు. ఈ నేపధ్యంలోనే అమ్మవారి అనుగ్రహం కోసం సాధారణ రోజుల కంటే ఎక్కువగా శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.
Ads
ఈ విధంగా అమ్మవారి కరుణా కటాక్షముల కోసం అమ్మవారికి పూజలు చేయడంతో పాటుగా కొన్ని నియమాలు పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి, జీవితం చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి మత్రమే కాకుండా శుక్రుడికి కూడా చాలా ప్రీతికరమైన రోజు. అందువల్ల శుక్రవారం రోజున ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..శుక్రవారం రోజున ముఖ్యంగా వివాహమైన మహిళలు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. శుక్రవారం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటుగా ఈ నియమాలను పాటిస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. సహజంగా అందరు రాత్రిపూట పడుకునే ముందు ప్రతిరోజూ ఇంట్లోని లైట్లన్నీ ఆఫ్ చేస్తూ ఉంటారు. అయితే శుక్రవారం నాడు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో ఈశాన్యం వైపు ఒక లైట్ కానీ, దీపాన్ని కానీ వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి సులువైన మార్గం ఏర్పడుతుందని చెబుతున్నారు.
శుక్రవారం నాడు గోమాతకు పచ్చగడ్డి తినిపించడం కూడా చాలా మంచిది. అంతే కాకుండా భోజనం చేసే ముందు ఆవుకి బెల్లం, నెయ్యి కలిపిన అన్నాన్ని కూడా పెట్టాలి. ఇక శుక్రవారం రోజున గోమాతకు పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి వారి వెంట ఉంటుంది. అలాగే ఎంతోమంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతు ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్నవారు శుక్రవారం సాయంత్రం సమయంలో పంచముఖ దీపాన్ని వెలిగించడం ద్వారా ఆర్దిక సమస్యల నుండి బయట పడవచ్చు.అమ్మవారి అనుగ్రహం నిత్యం ఉండాలంటే అమ్మవారికి హారతి ఇచ్చిన తరువాత ఆ బూడిదను డబ్బులు పెట్టుకునే పర్సులో పెట్టుకోవడం వల్ల అదృష్టం వెంట ఉంటుంది. అంతే కాకుండా శుక్రవారం నాడు సాయంత్రం భర్త తన సతిమణికి బహుమతి ఇచ్చినట్లయితే వారిద్దరి ఎంతో అన్యోన్యంగా ఉంటారు.
Also Read: దీపారాధన చేస్తున్నప్పుడు.. ఈ 5 తప్పులని అస్సలు చెయ్యకండి..!