ఎన్టీ రామారావు, తారకరత్న మరణాలకు మధ్య ఉన్న పోలిక ఏమిటో తెలుసా..!

Ads

నందమూరి తారకరత్న కన్నుమూయడంతో నందమూరి మరియు నారా కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన గత ఇరవై మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.

Ads

తారకరత్న కొద్ది రోజులలో కోలుకుని, క్షేమంగా తిరిగివస్తాడని ఆయన కుటుంబ సభ్యులు, నందమూరి ఫ్యాన్స్, టిడిపి పార్టీ వర్గాల వారు ఆశించారు. తారక రత్నకు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చేరిన దగ్గర నుండి ఫ్యాన్స్ ఆయన కొలుకోవాలని పూజలు చేస్తూనే ఉన్నారు. కానీ అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. 39 సంవత్సరాలకే తారకరత్న మరలి రాని లోకాలకు తరలి వెళ్లిపోయారు.
తారక రత్నకు భార్య పిల్లలు ఉన్నారు. ఆయన భార్య పేరు అలేఖ్య రెడ్డి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. మొదట కుమార్తె జన్మించగా, తర్వాత కవలలు పిల్లలు (పాప, బాబు) జన్మించారు. అయితే తన పిల్లలకు తాత ఎన్టీఆర్ పేరు వచ్చేట్టుగా పేర్లు పెట్టి, తారక రత్న తన తాత గారి మీద ఉన్న ప్రేమను తెలిపారు. పెద్ద అమ్మాయికి నిషిక (N), కుమారుడికి తనయ్ రామ్ (T), చిన్న అమ్మాయికి రేయా (R), NTR అని వచ్చేలా తన పిల్లలకు పేర్లు పెట్టారు. తారక రత్న ముగ్గురు పిల్లలు తాత బాలకృష్ణతో ఉన్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా నందమూరి తారక రామారావు 1996లో జనవరి 18న కాలం చేశారు. అయితే తారక రత్న కూడా అదే 18వ తేదీన ఫిబ్రవరిలో మహా శివరాత్రి రోజు కన్నుమూశారు. అనగా తాత ఎన్టీఆర్ కన్నుమూసిన నెల రోజులకు అదే 18వ తేదీన తారకరత్న మరణించారు. ఇక ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నందమూరి ఫ్యాన్స్, నందమూరి కుటుంబ సభ్యులు ఎమోషనల్ అవుతున్నారు. నందమూరి తారక రత్న చనిపోయారనే వార్తతో సినీ పరిశ్రమకు చెందిన వారు షాక్ అయ్యారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దగ్గర నుండి సినీ పరిశ్రమ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలుపుతూ, నివాళులు అర్పిస్తున్నారు.

Also Read: హీరోయిన్ మీనా త‌ల్లి కూడా ఒకప్పడు టాప్ హీరోయిన్‌ అని తెలుసా?

Previous articleఅరుంధతి సినిమాలో నటించిన ఈ బాలనటి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Next articleశుక్రవారం సాయంత్రం ఈ నియమాలు పాటించడం వల్ల అంతా శుభమే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.